SRH: హైదరాబాద్ పిచ్ అయితే 300.. లేకపోతే 150 కూడా కష్టమే
SRH: ఓపెనర్లుగా వెళ్లిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్యాట్ పడితే కొట్టకుండా ఆగరు. అలాంటిది వీరిద్దరి ఏమైందో కానీ.. అసలు మ్యాచ్‌లో ఆడటం లేదు. పట్టుమని డబుల్ డిజిట్ పరుగులు అయితే చేయడం లేదు.

SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశించినంత స్థాయిలో అయితే ఆడటం లేదు. గత సీజన్లతో పోలిస్తే.. ఈ సీజన్‌లో చాలా తక్కువగా ఆడుతుంది. ఇప్పటికే ఐపీఎల్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. నాలుగు మ్యాచ్‌లు ఇప్పటి వరకు ఆడగా.. ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. గత సీజన్‌లో 287, 277 భారీ స్కోర్లుతో రికార్డులు బద్దలు కొట్టారు. కానీ ఈ సీజన్‌లో ఇలాంటి స్కోర్ మళ్లీ చేయలేదు. మొదటి మ్యాచ్‌లో రాణించి గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంటే 300 పరుగులు ఫ్యాన్స్‌కు గుర్తు వస్తాయి. కానీ ఇప్పుడు 150 పరుగులు చేయడం కూడా కష్టమే అన్నట్లుగా ఉంది. గత సీజన్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్ముదులిపి ఫైనల్ వరకు వెళ్లింది. కానీ ఈసారి మాత్రం సన్‌రైజర్స్ జట్టు బాగా పడిపోయింది. ఫ్యాన్స్ ఆశించినంత స్థాయిలో అయితే ఆడటం లేదు. అందులోనూ ఉప్పల్ స్డేడియం అయితే బ్యాటింగ్‌లో రాణిస్తోంది. మిగతా మైదానంలో అయితే అసలు బ్యాట్‌ను తిప్పలేకపోతుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మొదట్లో బాగానే ఆడుతున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం పెవిలియన్ చేరుతున్నారు.
ఓపెనర్లుగా వెళ్లిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్యాట్ పడితే కొట్టకుండా ఆగరు. అలాంటిది వీరిద్దరి ఏమైందో కానీ.. అసలు మ్యాచ్‌లో ఆడటం లేదు. పట్టుమని డబుల్ డిజిట్ పరుగులు అయితే చేయడం లేదు. ఇటీవల సన్‌రైజర్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. ఓటమిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ కొట్టింది. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడింది. మొదటి మ్యాచ్‌తోనే భారీ విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. గతేడాది ఐపీఎల్‌లో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులతో అత్యధిక స్కోరుతో సన్‌రైజర్స్ జట్టు రికార్డు నమోదు చేసింది. ఓపెనర్లుగా దిగిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అదర గొట్టేసారు. మొదటి ఇన్నింగ్స్‌లోనే 10 ఓవర్లలో 135 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డు ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ పేరిట ఉంది. ఆ రికార్డును హైదరాబాద్ జట్టు బ్రేక్ చేసింది. సన్రైజర్స్ బద్దలు కొట్టారు. 2014 నుంచి ముంబై ఇండియన్స్ 120 పరుగులతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇప్పుడు హైదరాబాద్ జట్టు ఉంది.