SRH: నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా.. SRH కెప్టెన్ ఎంట్రీ వీడియో అదిరిపోయిందిగా..

SRH : మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ మొదలుకానుంది. గత సీజన్లో కోల్ కతా విజేతగా నిలిచింది. ఈసారి డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో కోల్ కతా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో బెంగళూరు జట్టుతో తలపడనుంది.ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ మార్చి 22న కోల్ కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో బెంగళూరు ,కోల్ కతా జట్లు తలపడబోతున్నాయి. మార్చి 23న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. గత సీజన్లో హైదరాబాద్ జట్టు రన్నరప్ గా నిలిచింది. ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది.. హైదరాబాద్ జట్టు గత సీజన్లో బలమైన టీమ్ లను ఓడించింది. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. అయితే ఫైనల్ పోరు లో మాత్రం కోల్ కతా జట్టును జయించలేకపోయింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగాల్సిన మ్యాచ్ లో చేతులెత్తేసింది. దీంతో కోల్ కతా జట్టు విజేతగా ఆవిర్భవించింది. గత సీజన్ తర్వాత మెగా వేలం జరగడం.. జట్టులోకి ప్రతిభావంతమైన ఆటగాళ్లు రావడంతో ఈసారి గతం కంటే గొప్పగా హైదరాబాద్ జట్టు కనిపిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.
కమిన్స్ ను ఓ రేంజ్ లో..
ఐపీఎల్ అంటేనే రిచ్ క్రికెట్ లీగ్.. కార్పొరేట్ కంపెనీలు ఆడే లీగ్. అందువల్లే ఐపీఎల్ అనేది సరికొత్తగా కనిపిస్తూ ఉంటుంది. రెగ్యులర్ టి20 క్రికెట్ టోర్నీకి.. ఐపీఎల్ కు చాలా తేడా ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు లీగ్ లో భారీగా పెట్టుబడులు పెడతాయి. ఇక ఇందులో ప్రతి అంశం కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అందువల్లే ఆయా జట్లు తమ ఆటగాళ్లకు సంబంధించి ప్రతి సందర్భంలో జాగ్రత్త వహిస్తుంటాయి. చూసే మ్యాచ్ పై మరింత హైప్ పెంచడానికి చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటాయి. తాజాగా హైదరాబాద్ జట్టు తమ కెప్టెన్ కమిన్స్ పై ఓ అద్భుతమైన వీడియో రూపొందించింది. అందులో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలోని “నెత్తురుకు మరిగిన హంగ్రీచీతా”అనే పాటను ఉపయోగించి.. తమ జట్టు కెప్టెన్ కమిన్స్ కు ఓ రేంజ్ లో హైప్ ఇచ్చింది. ఆ పాటకు తగ్గట్టుగానే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన కొత్త జెర్సీని కమిన్స్ వేసుకొని ఆకట్టుకున్నాడు.. గత సీజన్లో కమిన్స్ నాయకత్వంలో హైదరాబాద్ జట్టు ఫైనల్ వెళ్ళింది. ఫైనల్ లో కోల్ కతా చేతిలో ఓటమిపాలైంది. అయితే ఈసారి హైదరాబాద్ జట్టును విజేతగా నిలపడానికి కమిన్స్ తీవ్రంగా కృషి చేస్తున్నట్టు హైదరాబాద్ జట్టు వర్గాలు చెబుతున్నాయి..” కమిన్స్ నాయకత్వంలో హైదరాబాద్ జట్టు అద్భుతంగా ఆడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తొలి మ్యాచ్లో హైదరాబాద్ జట్టు రాజస్థాన్ ను ఢీకొంటుంది. సొంత మైదానంలో హైదరాబాద్ జట్టుకు తిరుగులేదు. పైగా కమిన్స్ జట్టును అద్భుతంగా తీర్చిదిద్దాడు. ప్లేయర్లలో స్ఫూర్తిని నింపాడు. ఈ క్రమంలో ఈసారి జరిగే మ్యాచ్లో హైదరాబాద్ జట్టు బోణి చేస్తుంది. అంతేకాదు ట్రోఫీని కూడా సాధిస్తుంది అనే నమ్మకం మాకు ఉందని” హైదరాబాద్ జట్టు వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి కమిన్స్ మీద రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
SILENCER EDIT BY SRH FOR PAT CUMMINS.
– Captain Cummins has arrived. 🥶pic.twitter.com/DoPOawcbLG
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2025
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే