IPL 2025 : ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ.. రూ.లక్ష కోట్లా!
IPL 2025: గతేడాది ఈ ఐపీఎల్ బ్రాండ్ విలువ 12 బిలియన్లకు చేరింది. రోజురోజుకీ ఐపీఎల్‌కి మరింత ఆదరణ పెరగడంతో దీని బ్రాండ్ విలువ కూడా పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసే వారి సంఖ్యతో పాటు స్పాన్సర్‌షిప్, బ్రాండ్ ఒక్కో జట్టు బ్రాండ్ విలువ అన్ని కూడా పెరుగుతున్నాయి. దీంతో ఐపీఎల్ బ్రాండ్ విలువ గతేడాది లక్ష కోట్లు అయ్యింది.

IPL 2025 : దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద స్పో్ర్ట్స్ లీగ్‌లో ఐపీఎల్ ఒకటి. ఈ ఐపీఎల్‌ను ఎక్కువగా క్రికెట్ ప్రేమికులు వీక్షిస్తుంటారు. గతేడాది ఈ ఐపీఎల్ బ్రాండ్ విలువ 12 బిలియన్లకు చేరింది. రోజురోజుకీ ఐపీఎల్‌కి మరింత ఆదరణ పెరగడంతో దీని బ్రాండ్ విలువ కూడా పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసే వారి సంఖ్యతో పాటు స్పాన్సర్‌షిప్, బ్రాండ్ ఒక్కో జట్టు బ్రాండ్ విలువ అన్ని కూడా పెరుగుతున్నాయి. దీంతో ఐపీఎల్ బ్రాండ్ విలువ గతేడాది లక్ష కోట్లు అయ్యింది. 2024లో మొత్తం 10 జట్ల ఆదాయం రూ.6797 కోట్లు. అయితే ప్రతీ సీజన్‌లో ఐపీఎల్ దాదాపుగా రూ.12 వేల కోట్లు సంపాదిస్తుంది. నిజానికి ఐపీఎల్‌లో మీడియా హక్కులు ఎక్కువ రైట్స్ ఉన్నాయి. మొత్తం రూ.48000 కోట్లు మీడియా హక్కుల ఒప్పందంపై సంతకం చేసింది. అయితే ఈ సీజన్‌లో గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలం నుంచి ఇప్పటికి రూ.90 కోట్లు సంపాదించింది.
ఈ ఏడాది ఐపీఎల్‌లో అత్యంత విలువైన బ్రాండ్ జట్లు కూడా ఉన్నాయి. మొదటి ప్లేస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఉండగా తర్వాత స్థానాల్లో ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ జట్లు 100 మిలియన్ల మార్క్‌ను కూడా దాటాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్రాండ్ విలువ 122 మిలియన్లు, ముంబై ఇండియన్స్ (MI) 119 మిలియన్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 117 మిలియన్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 109 మిలియన్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 85 మిలియన్లు, రాజస్థాన్ రాయల్స్ (RR) 81 మిలియన్లు, ఢిల్లీ క్యాపిటల్స్ (DC) 80 మిలియన్లు, గుజరాత్ టైటాన్స్ 69 మిలియన్లు, పంజాబ్ కింగ్స్ (PBKS) 68 మిలియన్లు, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 60 మిలియన్ల విలువ ఉంది. అయితే సీఎస్‌కే జట్టు బ్రాండ్ విలువ ప్రతి ఏడాది పెరుగుతూనే వస్తుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ జరుగుతోంది. ఈ క్రమంలో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్‌పైన భారీగా అంచనాలు ఉన్నాయి. మొదటి మ్యాచ్ లక్నో ఢిల్లీ జట్టుతో ఓడిపోయింది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తోందో చూడాలి. సన్‌రైజర్స్ జట్టులో అభిషేక్, హెడ్, ఇషాన్, నితీశ్, క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్‌వర్మ, అభినవ్ మనోహర్, కమిన్స్ (కెప్టెన్), సిమర్‌జీత్, హర్షల్, షమి ఉన్నారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో మార్‌క్రమ్, మార్ష్, పూరన్, పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), మిల్లర్, బదోని, శార్దూల్, షాబాజ్, బిష్ణోయ్, దిగ్వేష్, ప్రిన్స్ ఉన్నారు. మరి నేడు జరిగిన మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.
-
MS Dhoni : ఐపీఎల్‌లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్‌లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే