IPL 2025: ఫైనల్‌కు వెళ్లిన సంతోషమే లేదు.. శ్రేయస్ అయ్యర్‌కు బిగ్ షాక్
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. అయితే ముంబై జట్టు ముందు బ్యాటింగ్ చేసింది. ఇందులో 20 ఓవర్లలో ముంబై జట్టు 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.

IPL 2025: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. అయితే ముంబై జట్టు ముందు బ్యాటింగ్ చేసింది. ఇందులో 20 ఓవర్లలో ముంబై జట్టు 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అయితే పంజాబ్ జట్టు కేవలం 19 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని సాధించింది. అయితే ఈ పంజాబ్ జట్టు 2014 తర్వాత ఇదే మొదటిసారి ఫైనల్‌కు చేరడం. అయితే ఈ జట్టు ఫైనల్‌కు వెళ్లడంలో కెప్టె్న్ శ్రేయస్ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ విరుచుకుపడ్డాడు. 41 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. దీంతో ఈ ఇన్నింగ్స్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. తన కెప్టెన్సీలో మొత్తం మూడు జట్లును ఫైనల్స్‌కు నడిపించిన మొదటి కెప్టెన్‌గా కూడా రికార్డు సృష్టించాడు. అయితే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు కూడా స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించాయి. దీంతో ఈ రెండు జట్లు కెప్టెన్లకు జరిమానా విధించారు. మ్యాచ్ గెలిచిన ఆనందం కూడా లేకుండా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.24 లక్షల జరిమానా విధించారు. అయితే నియమాన్ని రెండోసారి పంజాబ్ కింగ్స్ జట్టు ఉల్లంఘించింది.
Read Also: రాజీవ్ యువ వికాసం పథకం ఆలస్యం కావడానికి కారణమిదే?
ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటన ద్వారా తెలిపింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 రెండవ క్వాలిఫయర్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు జరిమానా విధించాం. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం స్లో ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి అతని జట్టు ఈ సీజన్లో ఇది రెండవ నేరం కావడంతో శ్రేయస్ అయ్యర్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా మిగిలిన ప్లేయింగ్ ఎలెవన్ సభ్యులకు వ్యక్తిగతంగా రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఏది తక్కువైతే అది జరిమానా విధిస్తామని తెలిపింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా స్లో ఓవర్ రేట్ కొనసాగించిన తర్వాత అతనికి కూడా జరిమానా బీసీసీఐ విధించింది. ముంబైకి స్లో ఓవర్ రేట్ కారణంగా ఇలా మూడోసారి బీసీసీఐ శిక్ష విధించింది. అయితే హార్దిక్ పాండ్యాకు రూ.30 లక్షల జరిమానా విధించగా..మిగిలిన జట్టు సభ్యులు 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం ఏది తక్కువైతే అది చెల్లించాల్సి ఉంటుంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. అయినా కూడా ఓవర్లు అయితే తగ్గించలేదు. పంజాబ్ కింగ్స్ ఫైనల్లో ఆర్సీబీని ఎదుర్కోనుంది. ఈ టైటిల్ పోరు జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు.
-
Jofra Archer : 1596 రోజుల తర్వాత టీంలోకి తిరిగొచ్చిన స్టార్ ప్లేయర్.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు
-
Pat Cummins : శుభ్‌మన్ గిల్ సేనను చూసి కమ్మిన్స్ భయపడ్డారా? ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah : రెండో టెస్టుకు ముందు టీం ఇండియాకు గుడ్ న్యూస్.. బూమ్రా వచ్చేశాడు
-
Asia Cup 2025 : మరో క్రికెట్ సమరానికి ముహూర్తం ఫిక్స్.. క్రికెట్ అభిమానులకు పండుగే
-
India vs England : అక్కడ ఒక్క మ్యాచ్ గెలిచిన చరిత్రలేదు.. రెండో టెస్టులో టీం ఇండియా కష్టమే
-
Virat Kohli : ‘కోహ్లీతో నా కూతురికి పెళ్లి చేస్తా’: స్టార్ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్