IPL 2025: SRHకు గుడ్ న్యూస్.. జట్టులోకి వస్తున్న రేసు గుర్రం.. ఇక ఫైనల్ ఎంట్రీ పక్కా?

IPL 2025: ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ చీలమండ గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) లో కూడా ఆడటం కష్టమేనని వార్తలు వచ్చాయి. పాట్ కమిన్స్ శ్రీలంక టూర్ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమయ్యాడు. కానీ గాయం ఇంకా తగ్గలేదని ఈ సమయంలో స్కాన్ చేస్తే విషయం తెలిసింది. దీంతో కమిన్స్ (Pat Cummins) ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. అయితే స్టార్ బౌలర్ అయిన కమిన్స్ ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 25 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తర్వాత ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా పాట్ కమిన్స్ ఉన్నాడు. ఇంతటి స్టార్ బౌలర్ అయిన కమిన్స్ గత కొన్ని రోజులు నుంచి గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. ఈ సమయానికి కూడా కమిన్స్ గాయం నయం కాదని, అతను కోలుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని వార్తలు వినిపించాయి. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ చాలా ఆందోళన చెందారు. ఎందుకంటే హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు పాట్ కమిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇతని నాయకత్వంలోనే గతేడాది ఎస్‌ఆర్‌హెచ్ ఫైనల్ వరకు వెళ్లింది. దీంతో ఈ సీజన్‌కి కమిన్స్ లేకపోతే ఎలా అని ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందారు.
హైదరాబాద్ సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కి ఈ వార్త గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్‌కి కమిన్స్ తప్పకుండా ఉంటాడని వార్తలు వస్తున్నాయి. కమిన్స్ త్వరలోనే బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాడని, క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్ స్టార్ట్ అయ్యే సరికి.. కమిన్స్ గాయం నయం అవుతుందని అంటున్నారు. కమిన్స్ ఈసారి జట్టులో ఉంటే హైదరాబాద్ సన్‌రైజర్స్ ఈసారి కప్ కొట్టడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కమిన్స్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మొత్తం 58 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఈ మొత్తం మ్యాచ్‌లలో 63 వికెట్లు పడగొట్టగా.. ఇందులో 515 పరుగులు చేశాడు.
ఇదిలా ఉండగా.. మార్చి 22వ తేదీ నుంచి మే 27 వరకు ఐపీఎల్ 2025 జరగనున్నట్లు ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challangers Banglore) జట్ల మధ్య జరగనుంది. ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు 10 జట్లు ఆడనున్నాయి. మొత్తం 65 రోజుల పాటు ఐపీఎల్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ల కోసం మొత్తం 11 వేదికల్లో జరగనుంది.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్