Mitchell Marsh: ఏం కొట్టుడు అదీ.. మిచెల్ మార్ష్ సెంచరీ తడాఖా చూపించాడు
ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై జట్లు ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. అయితే ఇకపై జరిగే మ్యాచ్‌లు అన్ని కూడా నామమాత్రమే. గురువారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

Mitchell Marsh: ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై జట్లు ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. అయితే ఇకపై జరిగే మ్యాచ్‌లు అన్ని కూడా నామమాత్రమే. గురువారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు గెలిచింది. 33 పరుగుల తేడాతో లక్నో జట్టు గుజరాత్‌పై విజయం సాధించింది. అయితే లక్నో జట్టు ఓపెనర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్‌లో తన తొలి సెంచరీ కొట్టాడు. నికోలస్ పూరన్‌తో కలిసి సెంచరీ స్కోర్ చేశాడు. తన కెరీర్‌లో ఇవే అత్యుత్తమ ఇన్నింగ్స్. 64 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, 10 ఫోర్లతో 117 పరుగులు చేశాడు. పూరన్ 27 బంతుల్లో ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లుతో 56 నాటౌట్‌గా నిలిచాడు. సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. టైటాన్స్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో స్థానం సంపాదించుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో కాస్త రన్ రేటు తగ్గుతుంది. లక్నో జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచిన ఎలాంటి ఫలితం లేదు. కానీ భారీ స్కోర్ కొట్టి 33 పరుగుల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది.
Read Also: రికార్డు సృష్టించిన సూర్య కుమార్ యాదవ్
ఇదిలా ఉండగా ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీపై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నాలుగో ప్లేస్‌లోకి చేరింది. భారీ తేడాతో ఢిల్లీ ఓడిపోవడంతో రన్ రేట్ కూడా తగ్గిపోయింది. గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసుకు చేరాయి. అయితే మిగతా జట్లలో రాజస్థాన్ రాయల్స్‌కు మినహా మిగిలిన జట్లుకు ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లు కూడా నామమాత్రమే. గెలిచిన, ఓడిపోయిన ఒకటే. కాకపోతే పాయింట్ల టేబుల్‌లో ప్లేస్ మారుతుంది. అలాగే రన్ రేటు మారుతుంది. అయితే నేడు రాయల్స్ బెంగళూరు జట్టు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే బెంగళూరు జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రేసులో ఉంది. పాయింట్లు, రన్ రేటు కోసమే ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కనుక ఆర్సీబీ ఓడిపోతే ఇప్పుడున్న స్థానం కంటే ఒక ప్లేస్ కిందకి దిగుతుంది. దీనివల్ల చాలా కష్టమవుతుంది. ప్లే ఆఫ్ రేసులో ఉన్నప్పుడు ఈ పాయింట్ల చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఆర్సీబీ తప్పకుండా ఈ మ్యాచ్ గెలవాలి. లేకపోతే మళ్లీ పాయింట్ల పట్టిక మారిపోతుంది.
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు
-
Cricket League Viral Video: ఇదెక్కడి క్యాచ్ రా మావా.. ఎప్పుడూ చూడలే.. ఇలా కూడా పడతారా.. వీడియో వైరల్
-
IPL 2025 : ఐపీఎల్ వేలంలో రూ. 20 కోట్ల బిడ్..వాష్ రూంలోకి పరిగెత్తిన శ్రేయాస్ అయ్యర్!
-
Bengaluru Stampede : విరాట్ కోహ్లీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు
-
Piyush Chawla: రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ క్రికెటర్.. కారణమిదే!