Pakistan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మట్టిలో కలిసిపోవడం గ్యారెంటీ!
గతంలో ఓ దేశం వేరే దేశంతో డైరెక్ట్‌గా యుద్ధం చేసేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అక్కర్లేదు. నేరుగా ఒక దేశంతో యుద్ధం చేయకుండా వాటిని ఈజీగా మట్టిలో కలపవచ్చు. ఎక్కువగా ఇష్టపడే క్రికెట్ ఇంగ్లాండ్‌లో పుట్టింది. దీన్ని ప్రపంచానికి ఆస్ట్రేలియా అభివృద్ధి చేసింది. అయితే ఈ క్రికెట్ ఒకప్పుడు అమెరికాలో కూడా మంచి పాపులర్ అయ్యింది.

Pakistan: గతంలో ఓ దేశం వేరే దేశంతో డైరెక్ట్‌గా యుద్ధం చేసేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అక్కర్లేదు. నేరుగా ఒక దేశంతో యుద్ధం చేయకుండా వాటిని ఈజీగా మట్టిలో కలపవచ్చు. ఎక్కువగా ఇష్టపడే క్రికెట్ ఇంగ్లాండ్‌లో పుట్టింది. దీన్ని ప్రపంచానికి ఆస్ట్రేలియా అభివృద్ధి చేసింది. అయితే ఈ క్రికెట్ ఒకప్పుడు అమెరికాలో కూడా మంచి పాపులర్ అయ్యింది. కానీ ఇండియా మాత్రమే క్రికెట్‌కు సరికొత్త గా అభివృద్ధిని తీసుకొచ్చింది. ఒక కమర్షియల్ గేమ్ గా ఇండియానే ప్రపంచానికి క్రికెట్‌ను పరిచయం చేసింది. మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలోనే ఎక్కువగా క్రికెట్ చూస్తారు. ఇండియా క్రికెట్ విషయంలో చూపించిన తోవను ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు అనుసరిస్తున్నాయి. ప్రపంచ దేశాలు వివిధ రకాలుగా క్రికెట్‌ను ఆడి అన్ని విధాలుగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఇండియాలో జరిగే అది పెద్ద లీగ్ ఐపీఎల్ అయితే పెద్ద బిజినెస్. దేశంలో జరిగే ఈ లీగ్‌లో ఇంటర్నేషనల్ ప్లేయర్లు కూడా ఉంటున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ లీగ్ చాలా ముఖ్యమైనది. ఈ లీగ్ నుంచి కళ్లు చెదిరే బిజినెస్ జరుగుతోంది. ప్రపంచ ఆటగాళ్ల అందరికీ కూడా కనక వర్షం కురిపిస్తుందని చెప్పవచ్చు. ఈ ఐపీఎల్ వల్ల కోట్లు వస్తోంది. దీనివల్ల ఎందరో ఆటగాళ్లు కూడా ప్రపంచానికి పరిచయం అవుతున్నారు.
అంతర్జాతీయ విభాగంలో భారత్ క్రికెట్ పైన ఉంది. భారత్ క్రికెట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి క్రికెట్ బోర్డులకు కూడా ఆదాయం కల్పిస్తోంది. ప్రపంచ క్రికెట్‌లో భారత్ బాగా అభివృద్ధి చెందింది. ప్రపంచానికి కూడా అభివృద్ధి చెందుతుందటే భారత్ క్రికెట్ పాత్ర ఉంది. ముఖ్యంగా ఐసీసీలో చూసుకుంటే భారత్ ఒకటి అయితే మిగతా దేశాలు ఒకటి. క్రికెట్ అభివృద్ధికి సాయం చేయడానికి భారత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే కేవలం మన దేశం నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా గొప్ప ఆటగాళ్లు వస్తున్నారు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రస్తుతం పైన ఉంది. ఈ స్థాయిలో ఉండటానికి ముఖ్య కారణం భారత్. కేవలం ఆఫ్ఘనిస్థాన్‌కి మాత్రమే కాకుండా ఆసియాలోని చాలా దేశాలకు కూడా భారత్ ఇలానే సాయం చేస్తూ వస్తోంది. చివరకి పాకిస్తాన్‌కి కూడా భారత్ ఇదే విధంగా సాయం చేసింది. అయితే ఇప్పుడు పహల్గం దాడి తర్వాత మొత్తం మారిపోయింది. బీసీసీఐ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విషయంలో కఠినంగా ఉంది.
Read Also: రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఎంట్రీ అప్పుడేనా?
క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఆసియా కప్ టోర్నీలలో పాల్గొనకూడదని బీసీసీఐ ఒప్పుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను బీసీసీఐ బోర్డు సెక్రటరీ దేవజీద్ సైకిల్ ఖండించారు. దీనిపై ఎలాంటి చర్చలు కూడా బోర్డు జరపలేదని, ఏసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఎటువంటి లెటర్స్ రాయలేదని తెలిపారు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతోంది. ఆ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. దీనిపైనే బీసీసీఐ దృష్టి ఉన్నట్లు తెలిపారు. అయితే బీసీసీఐ పైకి ఇలా ఉన్నా కూడా పాకిస్తాన్‌ను ఎలాగైనా మట్టిలో కలపాలని ప్లాన్ చేస్తున్నట్లు జాతీయ కథనాలు చెబుతున్నాయి. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్‌లో హైబ్రిడ్ వేదికగా నిర్వహించారు. అప్పుడే పాక్‌కు భారీ నష్టం వచ్చింది. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడికి పాక్‌కు వెళ్లాలంటే ఫారిన్ ఆటగాళ్ల భయపడుతున్నారు. దీంతో టోర్నీలను పాక్‌లో నిర్వహించకూడదని ఐసీసీ ప్లాన్ చేస్తుంది.
Read Also: పచ్చిమిర్చితో గుండెపోటు ప్రమాదం తగ్గుతుందా?
ఒక వేళ ఏవైనా టోర్నీలు జరిగితే భారత్ న్యూట్రల్ వేదికగా ఆడుతుంది. దీనివల్ల పాక్‌కు ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే మిగతా జట్లుతో పోలిస్తే ఇండియా జట్టుకు ఎక్కువగా స్పాన్సర్లు వస్తారు. టోర్నీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెట్టుబడి భారీగా పెట్టిన ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఇప్పటిలో ఐసీసీ నిర్వహించే ఏ టోర్నీ కూడా పాకిస్తాన్‌లో జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. అలాగే ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా ప్రస్తుతం పాక్ వ్యక్తి ఉన్నారు. ఇతన్ని కేవలం నామమాత్రంగా మాత్రమే పెట్టారట. ఆర్థికంగా మాత్రమే కాకుండా పలుకుబడి విషయంలో కూడా పాక్ క్రికెట్ బోర్డును మట్టిలో కలపాలపి బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
-
IPL 2025 : ముగిసిన ప్లే ఆఫ్ రేస్.. ముంబై పైకి.. ఢిల్లీ ఇంటికి.. ఇక మ్యాచ్లన్నీ నామమాత్రం!
-
Team India: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్, రిషబ్ కాదు.. ఎవరంటే?
-
Gautam Gambhir: విరాట్, రోహిత్ ఔట్.. ఇక గౌతమ్ గంభీర్ హవానే!
-
IPL new schedule: ఐపీఎల్ న్యూ షెడ్యూల్ రిలీజ్.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?
-
MS Dhoni : ఐపీఎల్‌లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!