IPL 2025: ఐపీఎల్ అంటేనే కాసుల క్రీడ.. దానికి ఎమోషన్లు కూడా ఉంటాయా?
IPL 2025సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం వింధ్య విశాఖ హైదరాబాద్ జట్టుకు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే ఐపీఎల్ లో కొనసాగుతున్న పది జట్ల యాజమాన్యాలలో ఒక్క చెన్నై మినహా.. మిగతా అన్నింటికీ ప్రాంతంతో సంబంధం లేని వ్యక్తులు యజమానులుగా ఉన్నారని వింధ్య పేర్కొంది.

IPL 2025 : హాకీ మన జాతీయ క్రీడ.. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని క్రికెట్ ఆక్రమించేసింది. క్రికెట్ ను భారతీయులను వేరుగా చూడలేని పరిస్థితి వచ్చేసింది. క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్‌లో అయినప్పటికీ.. ఇప్పుడు దానిపై పెత్తనం సాగిస్తున్నది ఇండియా అంటే ఆశ్చర్యం అనిపించక మానదు.
క్రికెట్ మీద పెత్తనం సాగిస్తోంది కాబట్టే బీసీసీఐ 17వేల కోట్ల ఆస్తులతో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా వెలుగొందుతోంది. ఆశ్చర్యకరంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల బోర్డులు కలిసినా బీసీసీఐ లో కనీసం పావు వంతు కూడా ఉండవు.. అందువల్లే బీసీసీఐ 2008లో ఐపీఎల్ కు అంకురార్పణ చేసింది. ఆ తర్వాత అది అనేక మార్పులకు గురై ప్రపంచంలోనే అత్యధిక వీక్షణలు సొంతం చేసుకున్న రిచ్ క్రికెట్ లీగ్ గా అవతరించింది. ఇక ఐపీఎల్ 2008 నుంచి ఇప్పటివరకు 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేస్తుంది. మార్చి 22 నుంచి 18 వ సీజన్ లోకి అడుగుపెడుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ లో 10 జట్లు ఉన్నాయి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాతినిధ్యం వహిస్తోంది. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ గా ఉండేది. దాని మాతృ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో 2013లో సన్ గ్రూప్ ఆ జట్టును కొనుగోలు చేసింది. తద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ గా ఏర్పడింది. గత సీజన్లో రన్నరప్ గా హైదరాబాద్ జట్టు నిలిచింది.. మరి ఈసారి ఎలాంటి ఆట తీరు కొనసాగిస్తుందో చూడాల్సి ఉంది. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అది చెన్నై, ముంబై, బెంగళూరు జట్టుకు ఏమాత్రం తీసిపోదు. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ జట్టుకు సోషల్ మీడియాలో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచే క్రతువుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే వింధ్యావిశాఖ అనే స్పోర్ట్స్ యాంకర్ తో ప్రమోషనల్ వీడియోలు మొదలుపెట్టారు.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం వింధ్య విశాఖ హైదరాబాద్ జట్టుకు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే ఐపీఎల్ లో కొనసాగుతున్న పది జట్ల యాజమాన్యాలలో ఒక్క చెన్నై మినహా.. మిగతా అన్నింటికీ ప్రాంతంతో సంబంధం లేని వ్యక్తులు యజమానులుగా ఉన్నారని వింధ్య పేర్కొంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ జట్టు మాత్రమే ఉందని.. 2013లో హైదరాబాద్ జట్టు ఏర్పడిందని.. అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉందని.. అలాంటప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జట్టుగా హైదరాబాద్ ఉందని పేర్కొంది. హైదరాబాద్ జట్టులో నితీష్ కుమార్ రెడ్డి తెలుగు ఆటగాడుగా కొనసాగుతున్నాడని.. అతడు హైదరాబాద్ జట్టులో తన సత్తా చూపడం వల్లే జాతీయ జట్టులోకి ప్రవేశం పొందాడని వ్యాఖ్యానించింది.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ జట్టు మాత్రమే ఉందని.. తెలుగు ప్రజలు హైదరాబాద్ జట్టుకు మాత్రమే సపోర్ట్ చేయాలని ఇన్ డైరెక్ట్ గా వింధ్య వ్యాఖ్యానించింది.
క్రికెట్ అనేది గొప్ప క్రీడ కావచ్చు. కాకపోతే ఐపిఎల్ అనేది క్రాస్ బ్రీడ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వాక్యం చదివితే కొంత మందికి కోపం రావచ్చు. కాకపోతే ఇందులో కార్పొరేట్ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. రీచ్ పెంచుకోవడానికి.. వ్యూస్ దక్కించుకోవడానికి ఐపీఎల్ నిర్వహణ కమిటీ ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో భారీగా అంటే భారీగా డంపు చేస్తోంది. ఎలాగూ సమ్మర్.. పైగా రాత్రిపూట క్రికెట్ మ్యాచ్‌లు.. జియో హాట్ స్టార్ ఎలాగూ ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తుంది.. పైగా వింద్య లాంటి అందమైన యాంకర్లతో ఇలాంటి జాకీలు పెట్టే కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. అందువల్లే ఐపీఎల్ అనేది రిచ్ క్రికెట్ లీగ్ గా మారింది.. ప్రతి ఏడాది వేలకోట్ల వ్యాపార సాగుతున్నప్పటికీ.. నిర్వాహకులకు డబ్బు మీద ఆశ చావడం లేదు. అందువల్లే ఇలాంటి సెంటిమెంటల్ వీడియోలను షూట్ చేసి జనాల్లోకి బలంగా ఇంజక్ట్ చేస్తున్నారు. ఐపీఎల్ చూడక పోతే దేశద్రోహం అని.. హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ చేయకపోతే జాతి ద్రోహం అనే రేంజ్ లో గప్పాలు కొడుతున్నారు.
Haters ni nooru muyinchav akka 🔥 pic.twitter.com/soTHvj2yTk
— Deepu Varma ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@Deepu_Darling_) March 18, 2025
-
Jofra Archer : 1596 రోజుల తర్వాత టీంలోకి తిరిగొచ్చిన స్టార్ ప్లేయర్.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు
-
Pat Cummins : శుభ్‌మన్ గిల్ సేనను చూసి కమ్మిన్స్ భయపడ్డారా? ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah : రెండో టెస్టుకు ముందు టీం ఇండియాకు గుడ్ న్యూస్.. బూమ్రా వచ్చేశాడు
-
Asia Cup 2025 : మరో క్రికెట్ సమరానికి ముహూర్తం ఫిక్స్.. క్రికెట్ అభిమానులకు పండుగే
-
India vs England : అక్కడ ఒక్క మ్యాచ్ గెలిచిన చరిత్రలేదు.. రెండో టెస్టులో టీం ఇండియా కష్టమే
-
Virat Kohli : ‘కోహ్లీతో నా కూతురికి పెళ్లి చేస్తా’: స్టార్ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్