Rohit Sharma : రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఫిక్స్.. ఆ రోజే అనౌన్స్మెంట్!

Rohit Sharma :
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. మార్చి 9వ తేదీన భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య చివరి పోరు జరగనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు, టీమిండియా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ రిటర్మెంట్ పై కొన్ని ఊహాగానాలు బయటికి వచ్చాయి. ఎందుకంటే చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆయా జట్లు ఓటమిపాలైన తర్వాత పలువురు క్రికెటర్లు వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నారు. ఆ లిస్టులో స్టీవ్ స్మిత్, ముష్ఫికర్ రహీం వంటి ప్లేయర్లు ఉన్నారు. అదే సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ గా వ్యవహరించిన జోష్ బట్లర్ సైతం తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా నుంచి ఎవరు రిటైర్మెంట్ ప్రకటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే రోహిత్ శర్మ గత టి20 ప్రపంచ కప్ తర్వాత ఆ ఫార్మేట్ కి గుడ్ బాయ్ చెప్పేసారు. ఇక ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే ఫార్మేట్ కు రోహిత్ వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఫైనల్ మ్యాచ్ జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బిసిసిఐ వర్గాలు చెప్పాయి.
మరోవైపు రోహిత్ శర్మ కెప్టెన్సీకి గుడ్ బాయ్ చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు కెప్టెన్సీకి వీడ్కోలు పలికి ప్లేయర్గా జట్టులో కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చర్చించుకున్నట్లు సమాచారం. మొత్తంగా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే రోహిత్ శర్మ పై గతంలో విమర్శలు, ట్రోలింగ్స్ భారీ స్థాయిలో వచ్చాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ సమయంలో రోహిత్ శర్మ పై దారుణమైన విమర్శలు వచ్చాయి. దానికి ముఖ్య కారణం రోహిత్ శర్మ ఫామ్ లో లేకపోవడమే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ పేవలమైన ఫామ్ ను కొనసాగించాడు. దీంతో చాలామంది అతడిపై ట్రోల్స్ చేశారు. రోహిత్ శర్మ పని అయిపోయిందని అతడిని వెక్కిరించారు. వెంటనే అతడు రిటైర్మెంట్ ప్రకటించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి రోహిత్ శర్మ రిటర్మెంట్ పై వార్తలు బయటకు రావడం ఆసక్తికరంగా మారింది.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
Shreyas Iyer: రూ.23 కోట్లకు న్యాయం చేసిన అయ్యర్.. ఒక్క మ్యాచ్‌తో నోళ్లు మూయించేశాడుగా!
-
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. బుమ్రా ఎంట్రీ కష్టమే
-
IPL 2025: సన్ రైజర్స్ కు ఆడలేదు.. లక్నోకు దంచికొడుతుండు..ఇదేందయ్యా ఇదీ