Shreyas Iyer: రూ.23 కోట్లకు న్యాయం చేసిన అయ్యర్.. ఒక్క మ్యాచ్‌తో నోళ్లు మూయించేశాడుగా!
Shreyas Iyer స్టార్ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్‌లో 2021లో ఎంట్రీ ఇచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కోసం ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సీజన్‌లో అయితే వెంకటేష్ అయ్యర్ అదరగొట్టాడు.

Shreyas Iyer: ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధిచింది. అయితే ఈ మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి నోళ్లు మూయించాడు. ఈ సీజన్‌లో గత రెండు మ్యాచ్‌లలో వెంకటేష్ అయ్యర్ ఎక్కువగా విమర్శలు అందుకున్నాడు. ఎందుకంటే కోల్‌కతా జట్టు ఇతన్ని రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంత పెట్టి తీసుకుంటే.. కనీసం పరుగులు చేయడం లేదని విమర్శలు వచ్చాయి. అయితే ఒక్క మ్యాచ్‌తో మొత్తం టర్న్ చేసేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి.. కోట్ల రూపాయలకు న్యాయం చేశాడని అనిపించేలా చేశాడు. గత రెండు మ్యాచ్‌లలో కాస్త తడబడినా కూడా నిన్న జరిగిన మ్యాచ్‌లో మాత్రం రాణించాడు. సిక్స్‌లు, ఫోర్లుతో అద్భుతంగా ఆడాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ చెలరేగిపోయాడు.
ఈ సీజన్ మొదలు అయినప్పటి నుంచి వెంకటేష్ అయ్యర్ చెప్పుకునేంత పెద్ద ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. కేకేఆర్ జట్టు కోట్లు పెట్టి ఇతన్ని అనవసరంగా తీసుకుందని విమర్శలు కూడా ఎక్కువగానే వచ్చాయి. క్రికెటర్ల నుంచి ఫ్యాన్స్ వరకు ఎక్కువగా విమర్శలు చేశారు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌తో మొత్తం మార్చేశాడు. ఒక్క మ్యాచ్‌తోనే కోట్లుకు న్యాయం చేశాడని, ఇకపై ఇలాగే ఆడాలని అంటున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బెస్ట్ స్కోర్ చేస్తుందా? లేదా? అందరూ అనుకున్నారు. కానీ వెంకటేష్ అయ్యర్ అయితే బెస్ట్ స్కోర్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు. మొదట్లో నెమ్మదిగా ఆడినా అయ్యర్.. ఆ తర్వాత ఫోర్లు, సిక్సర్లతో బాదాడు. కేవలం 29 బంతుల్లో 60 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే వెంకటేష్ అయ్యర్ ఆఫ్ సెంచరీ చేశాడు.
స్టార్ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్‌లో 2021లో ఎంట్రీ ఇచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కోసం ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సీజన్‌లో అయితే వెంకటేష్ అయ్యర్ అదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్నింట్లో కూడా రాణించాడు. ఆ తర్వాత సీజన్‌లో పెద్దగా ఆడలేదు. కానీ ఆ తర్వాత 2023 సీజన్‌లో మాత్రం అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో అదరగొట్టి.. రికార్డులు కూడా సృష్టించాడు. గతేడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు టైటిల్ గెలవడంలో వెంకటేష్ అయ్యర్ ప్రముఖ పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఆఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ నాటౌట్‌గా నిలిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు ఉన్నాయి. మరి ఈ సీజన్‌లో ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
-
MS Dhoni : ఐపీఎల్‌లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్‌లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే