SRH VS RR : RRపై చరిత్ర సృష్టించిన SRH.. భారీ రికార్డు నమోదు
SRH VS RR : ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ అద్భుతమైన ఆట తీరు కనబరిచాడు. 47 బంతుల్లో 106 పరుగులు చేసి అబ్బురపరిచాడు.

SRH VS RR : సన్ రైజర్స్ హైదరాబాద్ గత ఏడాది ఐపీఎల్ లో విధ్వంసకర బ్యాటింగ్ కు మారుపేరుగా నిలిచింది. ఇది తక్కువ సమయంలోనే భారీ స్కోర్ సాధించి అబ్బురపరిచింది. ఈ ఏడాది కూడా కొత్త సీజన్ ను తనదైన శైలిలో ఆరంభించింది. తొలి మ్యాచ్ లోనే భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో ఈ సీజన్లో ఐపీఎల్ లో రెండో అత్యధిక స్కోర్ ను అందుకుంది. ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ అద్భుతమైన ఆట తీరు కనబరిచాడు. 47 బంతుల్లో 106 పరుగులు చేసి అబ్బురపరిచాడు. అందులో 11 ఫోర్లు నాలుగు సిక్సులు ఉన్నాయి. మిగతా బ్యాటర్లు తమదైన శైలిలో మెరుపులు మెరూపించారు. మొత్తంగా హైదరాబాద్ నిర్దేశించిన 20 ఓవర్లులో ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. అనంతరం టార్గెట్ చేదించేందుకు దిగిన ఆర్ఆర్ జట్టు బాగా పోరాడింది. నిర్దేశించిన 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసి చేతులెత్తేసింది.
RR ప్లేయర్లలో సంజు శాంసన్ 37 బంతుల్లో 66 పరుగులు చేసి అదరగొట్టేశాడు. అందులో 7ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. అలాగే ధ్రువ్ జురెల్ 35 బంతుల్లో 70 పరుగులు చేేసి ఔరా అనిపించాడు. హెట్మయర్ 23 బంతుల్లో 42 పరుగులు సాధించి అదరగొట్టేశాడు. అయితే గత ఏడాది ఐపీఎల్లో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులతో అత్యధిక స్కోరు రికార్డు నమోదు చేసిన హైదరాబాద్.. నిన్న (ఆదివారం) ఆ స్కోరుకు ఒక్క పరుగు దూరంలో ఆగిపోవడం గమనార్హం
అయితే ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ చరిత్రలోనే రికార్డు క్రియేట్ చేసింది. సన్‌రైజర్స్ తరఫున ఓపెనర్లుగా దిగిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అదరగొట్టేసారు. పవర్ ప్లే లో అద్భుతమైన ఆట ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. ఈ జట్టు తొలి ఇన్నింగ్స్ లోనే మొదటి 10 ఓవర్లలో 135 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ మొదటి ప్లేస్ లో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును హైదరాబాద్ సన్‌రైజర్స్ బద్దలు కొట్టారు. 2014 నుండి ముంబై ఇండియన్స్ 120 పరుగులతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో మొదటి 10 ఓవర్లలో 135 పరుగులు సాధించిన తొలి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఐపీఎల్ లో మొదటి 10 ఓవర్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్ పై అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్లు ఎక్కడ ఉన్నాయి.
135/2 : SRH, హైదరాబాద్, 2025
120/4 : MI, ముంబై, 2014
116/2 : KKR, ముంబై, 2022
115/1 : SRH, హైదరాబాద్, 2019
115/3 : DC, ఢిల్లీ, 2024
Also Read :
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే