Narayan Jagadeesan: పంత్ స్థానంలో తమిళనాడు కీపర్ జగదీశన్
Narayan Jagadeesan తీవ్ర గాయమైనా జట్టు కోసం బ్యాటింగ్ చేసిన పంత్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

Narayan Jagadeesan: ఇంగ్గాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో నాలుగో టెస్టు మొదటి రోజు ఆటలో కీపర్ రిషబ్ పంత్ కాలి వేలికి గాయంతో దాదాపు సిరీస్ నుంచే నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయి. పంత్ కు ఆరు వారాల విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించారు. రెండు రోజు కూడా పంత్ బ్యాటింగ్ కు వచ్చి 54 పరుగులు చేశాడు. తీవ్ర గాయమైనా జట్టు కోసం బ్యాటింగ్ చేసిన పంత్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
అయితే ఈ సిరీస్ లో పంత్ ఆడే అవకాశం లేకపోవడంతో బీసీసీఐ, సెలక్టర్లు ముందు జాగ్రత్త చర్యగా ఐదో టెస్టు కోసం తమిళనాడు కీపర్ జగదీశన్ కు ఎంపిక చేయనన్ను ట్లు సమాచారం. జగదీశన్ 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 47 సగటుతో 3373 రన్స్ చేశాడు. గత రంజీ సీజన్ లో 674 పరుగులు చేశాడు. ఇషాన్ కూడా గాయం కావడంతో జగతీశన్ కు అవకాశం వచ్చింది.