IPL 2025 : ముగిసిన ప్లే ఆఫ్ రేస్.. ముంబై పైకి.. ఢిల్లీ ఇంటికి.. ఇక మ్యాచ్‌లన్నీ నామమాత్రం!
ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే మూడు జట్టు ప్లేఆఫ్స్‌కు చేరాయి. గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరాయి. కేవలం ఒక్క ప్లేఆఫ్ రేసు కోసం మిగతా జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీ జట్టుకు ప్రతీ మ్యాచ్ కూడా చావో రేవో వంటింది. త

IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే మూడు జట్టు ప్లేఆఫ్స్‌కు చేరాయి. గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరాయి. కేవలం ఒక్క ప్లేఆఫ్ రేసు కోసం మిగతా జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీ జట్టుకు ప్రతీ మ్యాచ్ కూడా చావో రేవో వంటింది. తప్పకుండా మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కు చేరుతామని మైండ్‌లో పెట్టుకుని మరి ఆడుతున్నాయి. అయితే బుధవారం ముంబై ఇండియన్స్, ఢిల్లీ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కి వరుణుడి ముప్పు ఉందని అనుకున్నారు. కానీ మ్యాచ్ జరిగే సమయానికి ఎలాంటి ముప్పు లేదు. అయితే ఈ మ్యాచ్ ఇరు జట్లుకు కూడా ముఖ్యమైనది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు ఉంటాయి. చావో రేవో అన్నట్లుగా ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడి గెలిచింది. ఢిల్లీపై విజయం సాధించి ప్లేఆఫ్ రేసుకు చేరింది. ముంబై ఇండియన్స్ ఢిల్లీపై 59 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసులో నాలుగో ప్లేస్‌లోకి చేరింది. భారీ తేడాతో ఢిల్లీ ఓడిపోవడంతో రన్ రేట్ కూడా తగ్గిపోయింది. గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసుకు చేరాయి. అయితే మిగతా జట్లలో రాజస్థాన్ రాయల్స్‌కు మినహా మిగిలిన జట్లుకు ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. అయితే నేడు గుజరాత్, లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.
Read Also: మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం.. మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి?
ఢిల్లీ జట్టుకు ఈ మ్యాచ్ చాలా కీలకమైనది. తప్పకుండా ఈ మ్యాచ్‌తో పాటు మరో రెండు మ్యాచ్‌లు గెలవాల్సిందే. అప్పుడే ప్లే ఆఫ్ రేసుకు వెళ్లగలదు. కానీ ఢిల్లీ జట్టు 18.2 ఓవర్లోనే 121 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ జట్టు బ్యాటర్లు అయితే విఫలం అయ్యారు. సమీర్ రిజ్వీ, విప్రజ్ నిగమ్ మాత్రమే టాప్ స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లు అందరూ కూడా ఘోరంగా విఫలమయ్యారు. ముంబై జట్టు బౌలర్లు ఈ మ్యాచ్‌లో అదరగొట్టారు. మిచెల్ సాంట్నర్, బుమ్రా అయితే మూడు వికెట్లు తీసి మ్యాచ్‌లో కీలక మలుపు తిప్పారు. ఢిల్లీ జట్టుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు రాణించలేకపోయారు. ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశ పరిచారు. మ్యాచ్ ప్రారంభంలోనే ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ ఆశలు గాల్లో కలిసిపోయాయి. దీంతో ఢిల్లీ జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీ జట్టుకు ఇది చావో రేవో మ్యాచ్. కానీ ఘోరంగా విఫలమై సీజన్ నుంచి నిష్క్రమించింది.
-
IPL 2025 : రాజస్థాన్ రాయల్స్‌ను వీడి CSKలోకి సంజు శాంసన్? నిజమెంత?
-
Mitchell Marsh: ఏం కొట్టుడు అదీ.. మిచెల్ మార్ష్ సెంచరీ తడాఖా చూపించాడు
-
IPL 2025: రికార్డు సృష్టించిన సూర్య కుమార్ యాదవ్
-
IPL 2025: మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం.. మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి?
-
Team India: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్, రిషబ్ కాదు.. ఎవరంటే?
-
Pakistan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మట్టిలో కలిసిపోవడం గ్యారెంటీ!