WTC Prize Money: WTC విన్ అయిన జట్టుకు ఇంత ప్రైజ్ మనీ ఇస్తారా?

WTC Prize Money: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2023-25 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మూడవ ఎడిషన్ ఫైనల్ జూన్ 11న ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో ప్రస్తుతం మ్యాచ్ జరుగుతోంది. ఈ మెగా ఫైనల్‌లో టెస్ట్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం తలపడ్డాయి. అయితే ఈ రెండు జట్లలో ఒకటి విజేతగా నిలుస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ అందనుంది. అయితే ఫైనల్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా ఈసారి చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. గత ఎడిషన్‌లో అనగా 2023లో భారత్‌ను ఓడించి WTC ట్రోఫీని ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఇప్పుడు రెండోసారి ఛాంపియన్‌గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఘనత సాధిస్తే WTC చరిత్రలో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా అవతరిస్తుంది. దక్షిణాఫ్రికా గెలిస్తే మొదటి ఛాంపియన్స్ అవుతుంది. 1998లో ICC నాకౌట్ ట్రోఫీ గెలిచిన తర్వాత దక్షిణాఫ్రికా ఏ ఐసీసీ ట్రోఫీని కూడా గెలుచుకోలేక పోయింది. ఈసారి ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.
WTC ఫైనల్స్ మొత్తం ప్రైజ్ మనీ 5.76 మిలియన్లు అనగా.. ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ.49.24 కోట్లు అన్నమాట. ఇది గత రెండు ఎడిషన్ల కంటే ఎక్కువ. అయితే ఇందులో గెలిచిన జట్టు అనగా ఛాంపియన్‌గా నిలిచిన జట్టు 3.6 మిలియన్లు అంటే రూ.30.78 కోట్లు అందుకుంటుంది. రన్నరప్ జట్టు 2.16 మిలియన్ డాలర్లు అనగా రూ.18.56 కోట్లు అందుకుంటుంది. అయితే ఈ 2023-25 WTC సైకిల్‌లో పాల్గొన్న తొమ్మిది జట్లకు ప్రైజ్ మనీని ప్రకటించారు. గత రెండు ఎడిషన్లలో ఫైనల్స్‌కు చేరుకోకపోయినా, ఈసారి మూడవ స్థానానికి నిలిచిన భారత జట్టు 1.44 మిలియన్లు అనగా రూ.12.13 కోట్లు అందుకుంటుంది. నాల్గవ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌కు 1.2 మిలియన్లు (రూ.10.26 కోట్లు), ఐదవ స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్‌కు 0.96 మిలియన్లు (రూ.8.20 కోట్లు), ఆరవ స్థానంలో నిలిచిన శ్రీలంకకు 0.84 మిలియన్లు అనగా రూ. 7.18 కోట్లు లభిస్తాయి. ఫైనల్స్‌కు చేరుకోని మిగిలిన జట్లకు కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. ఏడో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ 0.72 మిలియన్లు (రూ. 6.15 కోట్లు), ఎనిమిదో స్థానంలో వెస్టిండీస్ 0.60 మిలియన్లు (రూ. 5.13 కోట్లు), తొమ్మిదో స్థానంలో పాకిస్తాన్ 0.48 మిలియన్లు (రూ. 4.10 కోట్లు) ఇస్తారు.
ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!