Spam Calls: స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ట్రిక్ పాటించండి

Spam Calls: మనం ఏదైనా బిజీ వర్క్ చేస్తుండగా ఒక్కసారి మొబైల్ ఫోన్ రింగ్ అవుతుంది. ఎంత బిజీ అయినా కూడా ఇంపార్టెంట్ కాల్ ఏమోనని లిఫ్ట్ చేస్తాం. తీరా లిఫ్ట్ చేసే సరికి స్పామ్ కాల్ అని తెలుస్తుంది. ఇలా రోజులో ఎన్నో సార్లు స్పామ్ కాల్స్ వస్తుంటాయి. అందులోనూ మనం బిజీ వర్క్‌లో ఉన్నప్పుడే స్పా్మ్ కాల్ ఎక్కువగా వస్తుంది. ఈ స్పామ్ కాల్స్ చాలా చిరాకు పెడతాయి. దీంతో మనం చాలా కోపం వస్తుంది. కొన్నిసార్లు అయితే ఇరిటేషన్ కూడా వస్తుంది. ఇలాంటి కాల్స్‌ను ఆపడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా చర్యలు తీసుకుంది. కానీ ఈ టెలి మార్కెటింగ్ కాల్స్ నుంచి విముక్తి మాత్రం దొరకడం లేదు. ఇలాంటి కాల్స్ వల్ల స్పా్మ్ కూడా ఎక్కువగా జరుగుతుంది. కాల్స్ చేసి యూజర్లను కూడా సమస్యల్లోకి లాగేస్తున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు, లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇలా రకరకాల కారణాలతో కాల్స్ చేస్తుంటారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఓ చిన్న ట్రిక్ పాటించాలి. మరి అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
స్పామ్ కాల్స్ రాకుండా యాక్టివేట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత FULLY BLOCK అని క్యాపిటల్ లెటర్స్‌లో రాసి.. 1909 అనే నంబర్‌కి పంపాలి. ఇలా పంపిన తర్వాత మీకు కన్ఫామ్ మెసేజ్ ఒకటి వస్తుంది. ఈ మెసేజ్ వచ్చిన 24 గంటల తర్వాత మీకు ఇక స్పామ్ కాల్స్ రావడం ఆగిపోతాయి. అయితే మీరు ఎంచుకునే ఆప్షన్ బట్టి వాటికి సంబంధించిన కాల్స్ రావడం ఆగిపోతాయి. కన్ఫా్మ్ మెసేజ్ వచ్చిన తర్వాత BLOCK 1 అని టైప్ చేస్తే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు వంటి కాల్స్ బ్లాక్ అవుతాయి. BLOCK 2 అని టైప్ చేస్తే రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన కాల్స్ ఆగుతాయి. BLOCK 3 ఎడ్యూకేషన్‌కి సంబంధించిన స్పామ్ కాల్స్ ఆగిపోతాయి. BLOCK 4 అని టైప్ చేస్తే హెల్త్‌కి సంబంధించిన కాల్స్ అన్ని కూడా ఆగిపోతాయి. BLOCK 5 అని టైప్ చేస్తే ఆటో మొబైల్‌కి సంబంధించిన కాల్స్ ఆగిపోతాయి. BLOCK 6 అని టైప్ చేస్తే బ్రాడ్ కాస్టింగ్, కమ్యూనికేషన్ వంటి కాల్స్ ఆగిపోతాయి. BLOCK 8 అని టైప్ చేస్తే టూరిజమ్‌కి సంబంధించిన కాల్స్ అన్ని కూడా ఆగిపోతాయి. ఈ విధంగా మీరు స్పామ్ కాల్స్ బాధ నుంచి బయటపడవచ్చు.