Selfie: సెల్ఫీలో పదాలు రివర్స్‌లో కనిపిస్తున్నాయా.. ఈ సెట్టింగ్స్ మార్చుకోండి

Selfie: సెల్ఫీ అనేది ప్రస్తుతం ట్రెండ్ అయిపోయింది. ఎక్కడికైనా వెళ్తే కాస్త మోమోరీగా ఉండటానికి తప్పకుండా కొందరు సెల్ఫీలు తీస్తుంటారు. అయితే సాధారణంగా సెల్ఫీ తీస్తే కుడి, ఎడమ రివర్స్‌లో పడతాయి. మనుషులు పడటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అక్షరాలు, పదాలు వంటివి కూడా రివర్స్‌లో పడితే వాటిని తెలుసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మందికి వీడియోలు తీయడానికి ఎవరూ లేకపోతే వారే మొబైల్‌ను పెట్టి వీడియోలు తీస్తుంటారు. ఏవైనా స్టడీ పరంగా వీడియోలు తీస్తే కాస్త ఇబ్బంది అవుతుంది. అయితే సెల్ఫీ వీడియో లేదా ఫొటో తీసేటప్పుడు పదాలు రివర్స్‌లో రాకుండా సరిగ్గా రావాలంటే తప్పకుండా కొన్ని ట్రిక్స్ పాటించాలి. కొన్ని సెట్టింగ్స్ మొబైల్‌లో మార్చి ఆ తర్వాత సెల్ఫీ వీడియో లేదా ఫొటో తీస్తే మాత్రం పదాలు రివర్స్‌లో రాకుండా కరెక్ట్‌గా వస్తాయి. మరి ఆ సెట్టింగ్స్ ఏంటి? ఎలా మార్చాలో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: ముగిసిన ప్లే ఆఫ్ రేస్.. ముంబై పైకి.. ఢిల్లీ ఇంటికి.. ఇక మ్యాచ్లన్నీ నామమాత్రం!
ఐఫోన్ వినియోగదారులే అయితే.. iPhone లో సెట్టింగ్‌లకు వెళ్లండి. కిందకు స్క్రోల్ చేసి కెమెరాపై నొక్కండి. ఆ తర్వాత మిర్రర్ ఫ్రంట్ కెమెరా లేదా మిర్రర్ ఫ్రంట్ ఫోటోస్ దాన్ని ఆపివేయండి. ఇలా చేస్తే మీ ఫొటోలు సరిగ్గా వస్తాయి. అదే Android వినియోగదారులు అయితే కెమెరా యాప్‌ను ఓపెన్ చేసి సెల్ఫీ మోడ్‌కి వెళ్లండి. అప్పుడు సెట్టింగ్‌లపై నొక్కి.. మిర్రర్ సెల్ఫీ, ఫ్లిప్ సెల్ఫీ లేదా ప్రివ్యూగా సేవ్ చేయడం వంటివి చేసి ఆ ఆప్షన్‌ను ఆపేయండి. ఈ సెట్టింగ్స్ మారిస్తే మాత్రం తప్పకుండా మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌లో తప్పకుండా ఫొటోలు సరిగ్గా వస్తాయి. మొబైల్ సెల్ఫీ విషయంలో ఈ ట్రిక్స్ పాటించడం వల్ల మీరు ఈజీగా పదాలను చూడవచ్చు. ఇవే కాకుండా యాప్స్ కూడా ఉంటాయి. మీరు ప్లే స్టోర్‌కి వెళ్లి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించవచ్చు.
Read Also: IPL 2025: రికార్డు సృష్టించిన సూర్య కుమార్ యాదవ్
ప్రస్తుతం చాలా మంది ఫొటోలు కోసం సెల్ఫీలు వాడుతున్నారు. ప్రతీ చిన్న విషయానికి సెల్ఫీ తీసుకోవడం ఒక అలవాటు అయ్యింది. బ్యాక్ కెమెరా అయితే సరిగ్గా ఫొటోలు రావని, ముఖ్యంగా అందంగా కనిపించరని కొందరు ఫ్రంట్ కెమెరా వాడుతున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్లు అయితే ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఎన్నో సెల్ఫీలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడానికి, అన్నింట్లో వారు చేసిన విషయాలు తెలియడానికి ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటారు. ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకుంటే లెఫ్ట్, రైట్ అనే తేడాలు లేకుండా సరిగ్గా వస్తుంది. ఇకపై ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు.