Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Technology News »
  • Earthquake Alert Mobile Phone Earthquake

Earthquake Alert: మొబైల్ ఫోన్‌తో భూకంపం గుర్తింపు.. ఈ ట్రిక్స్‌ పాటిస్తే ఈజీనే

Earthquake Alert: మొబైల్ ఫోన్‌తో భూకంపం గుర్తింపు.. ఈ ట్రిక్స్‌ పాటిస్తే ఈజీనే
  • Edited By: NARESH ENNAM,
  • Updated on March 3, 2025 / 01:31 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Earthquake Alert:

ఈ మధ్య కాలంలో భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయి. తక్కువ తీవ్రతతో వస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ రెక్టర్ స్కేల్‌పై ఎక్కువ తీవ్రతతో వస్తే మాత్రం చాలా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. అయితే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగంలో నడుస్తున్నాం. ఏ విషయాన్ని అయినా కూడా తెలుసుకోవాలనుకున్నా స్మార్ట్ ఫోన్‌తోనే తెలుసుకుంటున్నారు. అయితే భూకంప తీవ్రతను కూడా ముందే మొబైల్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. మొబైల్ ద్వారా భూకంపాన్ని ముందే గుర్తించవచ్చనే విషయం మనలో చాలా మందికి తెలియదు.

మన మొబైల్ ద్వారా కూడా ఈజీగా ముందు భూకంపాన్ని గుర్తించవచ్చు. ఎందుకంటే మన మొబైల్‌లో యాక్సిలేరోమీటర్లు అని పిలిచే అంతర్నిర్మిత మోషన్ సెన్సార్లు ఉంటాయి. భూమి నుంచి వచ్చే ప్రకంపనాలు ఇవి ఈజీగా గుర్తిస్తాయి. అయితే ఒక ప్రాంతంలో ఉన్న అన్ని మొబైల్స్ కూడా ఈ భూకంప ప్రకంపనాలను గుర్తిస్తే.. అన్ని కలిపి డేటాను సెంట్రల్ సర్వర్‌కు చేరుస్తాయి. ఒకవేళ భూకంపం వస్తే మాత్రం హెచ్చరికలు కూడా ముందగానే మొబైల్‌కి పంపుతుంది. దీని వల్ల తక్కువ సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి కాస్త సమయం ఉంటుంది. అయితే ఈ భూ ప్రకంపనలు తెలియాలంటే మాత్రం మీ మొబైల్స్‌లో కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి. మరి మొబైల్స్‌లో మార్చుకోవాల్సిన ఆ సెట్టింగ్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్లు అయితే మీ మొబైల్స్ సెట్టింగ్స్‌కి వెళ్లి సేఫ్టీ అండ్ ఎమెర్జెన్సీ అనే ఆప్షన్‌పై క్లి్క్ చేయాలి. ఇందులో ఎర్త్‌క్వేక్ వార్నింగ్స్ (Earthquake Warning) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఆన్ చేసుకుంటే.. మీకు హెచ్చరికలు జారీ చేస్తుంది. అదే ఐఫోన్ వాడే వారు అయితే నోటిఫికేషన్‌పై క్లిక్ చేయాలి. కిందకి వెళ్తే.. అత్యవసర హెచ్చరిక అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే భూకంప హెచ్చరికలు అనే ఆప్షన్ కనిపిస్తుంది. అయితే చాలా మందికి ఈ సెట్టింగ్స్ గురించి తెలియదు. గూగుల్ ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికను 2020లోనే తీసుకొచ్చింది. మొబైల్స్ భూకంప డిటెక్టర్లుగా చెప్పుకుంటారు. ప్రతీ ఒక్కరూ కూడా ఈ సెట్టింగ్స్‌ను ఆన్ చేసుకుంటే.. ఎప్పుడు భూకంపం వచ్చినా కూడా తెలుస్తుంది. అన్ని మొబైల్స్ డేటాను సెర్వర్‌కు పంపుతాయి. దీంతో కొంత వరకు ప్రాణా నష్టాన్ని కాపాడవచ్చు. ఇటీవల కాలంలో భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతీ ఒక్కరూ కూడా ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే కొంత వరకు ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. దీనివల్ల కొంత వరకు ప్రజలను కాపాడవచ్చు. ప్రస్తుతం ఎలాగో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అలాంటి వారందరూ కూడా సెట్టింగ్స్ మార్చుకుంటే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి ఫస్ట్ మీ మొబైల్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి.

Tag

  • Earthquake Alert
  • Privacy
  • Settings
Related News
  • Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు

  • Call Record : కాల్ రికార్డ్ చేయడం కరెక్టా ? కాదా ? ఇలా చేస్తే జైలుకెళ్లడం ఖాయమా ? పూర్తి వివరాలివే

  • Selfie: సెల్ఫీలో పదాలు రివర్స్‌లో కనిపిస్తున్నాయా.. ఈ సెట్టింగ్స్ మార్చుకోండి

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us