Call Record : కాల్ రికార్డ్ చేయడం కరెక్టా ? కాదా ? ఇలా చేస్తే జైలుకెళ్లడం ఖాయమా ? పూర్తి వివరాలివే

Call Record : ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఫీచర్ చాలా కామన్ అయిపోయింది. చాలామంది దీన్ని వాడుతుంటారు. ఎవరైనా చెప్పిన మాటలకు సాక్ష్యంగా పెట్టుకోవడానికి, లేదా ఆఫీసు విషయాలను భద్రంగా ఉంచుకోవడానికి వాడుతున్నారు. అయితే, కాల్స్ రికార్డ్ చేయడం చట్టపరంగా సరైనదేనా? దీనికి ఏమైనా శిక్ష పడుతుందా? అన్న ప్రశ్న చాలా మందిలో ఉంది. భారతదేశంలో కాల్ రికార్డింగ్‌కు సంబంధించిన నిబంధనలు, చట్టాలు ఏంటి? ఏ పరిస్థితుల్లో ఇది నేరం అవుతుంది? అనే విషయాలను ఈ వివరంగా తెలుసుకుందాం.
కాల్ రికార్డ్ చేయడం నేరమా?
కాల్ రికార్డ్ చేయడం అనేది పూర్తిగా నేరం కాదు. కానీ, దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో, వాళ్ళ అనుమతి తీసుకుని కాల్ రికార్డ్ చేస్తే, అది చట్టబద్ధంగా సరైనదే. ఒకవేళ మీరు ఎదుటి వ్యక్తికి చెప్పకుండా వాళ్ళ కాల్ రికార్డ్ చేస్తే, అది వాళ్ళ వ్యక్తిగత ప్రైవసీని ఉల్లంఘించినట్లు అవుతుంది. అప్పుడు మీపై లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది.
భారతదేశంలో చట్టం ఏం చెబుతోంది?
భారత శిక్షా స్మృతి (IPC), సమాచార సాంకేతిక చట్టం ప్రకారం.. అనుమతి లేకుండా ఎవరి కాల్ అయినా రికార్డ్ చేయడం, ఆపై దాన్ని ఎవరికైనా వ్యతిరేకంగా వాడడం లేదా సోషల్ మీడియాలో పెట్టడం అనేది నేరం. ఇది మోసం లేదా బ్లాక్మెయిల్ అనే కేటగిరీల్లోకి కూడా రావచ్చు.
ఏం శిక్ష పడొచ్చు?
ఒకవేళ మీరు ఎవరి కాల్ అయినా వాళ్ళ అనుమతి లేకుండా రికార్డ్ చేసి, దాన్ని తప్పుగా వాడితే పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవచ్చు. ఐపీసీ సెక్షన్ 354D స్టాకింగ్ (ఎవరినైనా వెంటపడటం లేదా పదే పదే ఇబ్బంది పెట్టడం), ఐటీ యాక్ట్ సెక్షన్ 66E: ప్రైవసీని భంగపరిచినందుకు, ఐపీసీ సెక్షన్ 499, 500 పరువు నష్టం కలిగించినందుకు కేసులు నమోదు చేయవచ్చు. ఈ కేసుల్లో మీకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉంది.
Read Also:Mohan Babu : మంచు విష్ణు కోసం న్యూజిలాండ్ లో 7000ఎకరాలు కొన్న మోహన్ బాబు.. వీడియో వైరల్
ఎప్పుడు కాల్ రికార్డింగ్ చట్టపరంగా సరైనది?
కాల్ రికార్డింగ్ కొన్ని సందర్భాల్లో చట్టపరంగా సరైనదే. ఫోన్ మాట్లాడుతున్న ఇద్దరు వ్యక్తులు కాల్ రికార్డ్ చేయడానికి అంగీకరిస్తే, ఆఫీసుల నుంచి లేదా కస్టమర్ కేర్ నుంచి వచ్చే కాల్స్‌లో ముందుగానే “ఈ కాల్ నాణ్యత, శిక్షణ ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడుతోంది” అని చెప్పినప్పుడు ఇది సరైనదే.
ఎవరి కాల్ అయినా గుట్టుగా రికార్డ్ చేయడం, ఆపై దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం, ఇతరులకు పంపడం, లేదా బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి వాడటం – ఇవన్నీ తీవ్రమైన నేరాలు. ఇలాంటి పనులు సోషల్ ఇమేజ్‌తో పాటు, మీ భవిష్యత్తుపై కూడా చాలా చెడు ప్రభావం చూపుతాయి. ఈ రోజుల్లో చాలా థర్డ్ పార్టీ యాప్స్ కాల్స్‌ను రికార్డ్ చేస్తాయి. అందుకే సెట్టింగ్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి.