Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Technology News »
  • Isro 101st Satellite Risat 18 Launch May 18

ISRO : అంతరిక్షంలో భారత్ మరో ముందడుగు.. మే 18న ఇస్రో 101వ ప్రయోగం.. ప్రత్యేకతలివే!

ISRO : అంతరిక్షంలో భారత్ మరో ముందడుగు.. మే 18న ఇస్రో 101వ ప్రయోగం.. ప్రత్యేకతలివే!
  • Edited By: rocky,
  • Updated on May 15, 2025 / 09:54 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. మే 18న RISAT-18 అనే 101వ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇది భూమిని నిరంతరం పరిశీలించడం, నిఘా సామర్థ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఉపగ్రహాన్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C61) ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “మేము జనవరిలో శ్రీహరికోట నుంచి మా 100వ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించాం. ఇప్పుడు మే 18న భారతదేశం 101వ ఉపగ్రహం RISAT-18 ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహంగా ప్రయోగించనున్నాం” అని తెలిపారు.

ఈ ఉపగ్రహం భారతదేశం నిఘా, రిమోట్ సెన్సింగ్, విపత్తు స్పందన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశ భద్రత, సంరక్షణకు సాయపడుతుంది. నారాయణన్ మాట్లాడుతూ.. ఇస్రో అన్ని మిషన్లు భారతదేశ భద్రత, జాతీయ అవసరాల ఆధారంగానే ప్లాన్ చేస్తామని స్పష్టం చేశారు. భారత సాయుధ దళాల కోసం ప్రత్యేక ప్రయోగాల గురించి అడిగినప్పుడు ఆ కార్యక్రమాలన్నీ దేశ ప్రజల భద్రత కోసమే అని స్పష్టం చేశారు.

Read Also :Bharat 6G 2025 : టెలికాం రంగంలో విప్లవం.. 5G కంటే 100 రెట్లు వేగంతో ఇంటర్నెట్!

1979లో ఇస్రో ప్రస్థానం ప్రారంభం
నారాయణన్ ఇస్రో ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. భారతదేశం 1979లో SLV-3 రాకెట్ ద్వారా తన అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇందులో 98 శాతం విజయం సాధించింది. మొదటి మిషన్ విజయవంతంగా 1980లో జరిగింది. అప్పటి నుంచి సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం బలోపేతం చేసుకుంటూ వస్తుంది ఇస్రో. ఇస్రో ఇప్పుడు రక్షణ, విపత్తు నిర్వహణ, వ్యవసాయం, వాతావరణ పర్యవేక్షణ వంటి కీలక రంగాల్లో భారతదేశ ప్రయోజనాల నిమిత్తం సేవ చేసేందుకు ఇస్రో కట్టుబడి ఉంది.

ఇస్రో తదుపరి మిషన్ EOS-09 (RISAT-1B)
ఇస్రో తదుపరి మిషన్ EOS-09 (RISAT-1B)ను కూడా ప్రకటించింది. ఇది జూన్ 18, 2025న శ్రీహరికోట నుంచి ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం భారతదేశం భూ పరిశీలన కార్యక్రమంలో మరొక ముఖ్యమైన అడుగు కాబోతుంది. ఇస్రో అంతరిక్ష మిషన్లు ఇప్పుడు జాతీయ భద్రత, నిఘా, విపత్తు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది దేశం సాంకేతిక, వ్యూహాత్మక శక్తిని మరింత పెంచుతోంది.

Read Also :Social Media : వర్చువల్ ప్రపంచం.. వెలివేసిన బంధాలు.. సోషల్ మీడియా తెచ్చే ఒంటరితనం ఎలా ఉంటుందంటే ?

Tag

  • India Space
  • ISRO
  • RISAT-18
  • Satellite Launch
  • Space Mission
Related News
  • Joining ISRO: ఇస్రోలో చేరడం మీ కల అయితే.. ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us