Free WiFi: పబ్లిక్ వైఫై వాడేటప్పుడు ఈ ఐదు టిప్స్ గుర్తుంచుకోండి!
Free WiFi: ఫ్రీ ఇంటర్నెట్ మీ భద్రతకు ఎంత ప్రమాదమో తెలుసా? పబ్లిక్ వైఫై వాడేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే, మీ వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యే అవకాశం ఉంది.

Free WiFi: ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ ఇంటర్నెట్ దొరికేస్తుంది.. ఫ్రీ ఇంటర్నెట్ దొరుకుతుండడంతో వాడుకోవాలని అందరికీ అనిపిస్తుంది. కేఫ్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే స్టేషన్‌లు లేదా ఏవైనా పబ్లిక్ ప్లేస్‌లలో వైఫై కనెక్ట్ అవ్వగానే ఆలోచించకుండా వాడేస్తుంటారు. కానీ ఈ ఫ్రీ ఇంటర్నెట్ మీ భద్రతకు ఎంత ప్రమాదమో తెలుసా? పబ్లిక్ వైఫై వాడేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే, మీ వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యే అవకాశం ఉంది. దానివల్ల మీకు చాలా నష్టం జరగవచ్చు.
పబ్లిక్ వైఫై ఎందుకు డేంజర్?
పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లు చాలావరకు సురక్షితంగా ఉండవు. హ్యాకర్లు ఈ నెట్‌వర్క్‌ల ద్వారా మీ డేటాను ఈజీగా దొంగిలించగలరు. పబ్లిక్ వైఫై వాడుతూ ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేసినా, ఈమెయిల్స్ పంపినా, లేదా సోషల్ మీడియాలో లాగిన్ అయినా, మీ లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, ఇంకా ఇతర ముఖ్యమైన వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్లిపోవచ్చు. వాళ్లు మీ కదలికలపై నిఘా పెట్టవచ్చు లేదా మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో వైరస్‌లు (మాల్‌వేర్) కూడా పెట్టవచ్చు.
Also Read: Small AC: రూ.2వేల లోపే ఏసీ లాంటి గాలి.. దీంతో ఈ వేసవికి గుడ్ బై చెప్పేయండి
పబ్లిక్ వైఫై వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
* VPN వాడండి: VPN (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను సురక్షితంగా చేస్తుంది. ఇది మీ వివరాలను ఎన్‌క్రిప్ట్ (గుర్తుపట్టలేని విధంగా మారుస్తుంది) చేస్తుంది. దీనివల్ల హ్యాకర్లు మీ సమాచారాన్ని దొంగిలించడం చాలా కష్టం అవుతుంది.
* ఆన్‌లైన్ లావాదేవీలకు దూరంగా ఉండండి: పబ్లిక్ వైఫై వాడేటప్పుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్, షాపింగ్ లేదా ఏ రకమైన డబ్బు లావాదేవీలు చేయకండి. ఇది మీ క్రెడిట్ కార్డ్ వివరాలు, బ్యాంక్ వివరాలు దొంగిలించబడకుండా కాపాడుతుంది.
* HTTPS వెబ్‌సైట్లు మాత్రమే వాడండి: ఎప్పుడూ HTTPS అని మొదలయ్యే వెబ్‌సైట్‌లను మాత్రమే వాడండి. ఎందుకంటే ఈ వెబ్‌సైట్‌లు ఎక్కువ సురక్షితంగా ఉంటాయి.
* సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్ చేసుకోండి: మీ ఫోన్/కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంచుకోండి. దీనివల్ల కొత్తగా వచ్చే సైబర్ దాడుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
* తెలియని నెట్‌వర్క్‌లకు దూరంగా ఉండండి: ఏదైనా అజీబ్‌గా ఉండే పేరుతో ఉన్న లేదా చాలామంది వాడుతున్న వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వకండి. అలాంటి నెట్‌వర్క్‌లు తరచుగా సురక్షితంగా ఉండవు.
Also Read: Jio: ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్ కి గుడ్‌న్యూస్.. జియో నుంచి బంపర్ ఆఫర్
పైన చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే పెద్ద ఆర్థిక నష్టం నుంచి బయటపడవచ్చు. లేకపోతే, ఈ ఫ్రీ ఇంటర్నెట్ గండం మిమ్మల్ని పెద్ద కష్టాల్లోనికి నెట్టే అవకాశం ఉంది.