Jio: ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్ కి గుడ్‌న్యూస్.. జియో నుంచి బంపర్ ఆఫర్
jio: జియో అందిస్తున్న ఈ ప్రత్యేక ప్లాన్ ధర రూ.1028. ఈ ప్లాన్‌తో రిలయన్స్ జియో నుంచి ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

Jio: మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా.. అయితే రిలయన్స్ జియో మీకు ఏకంగా రూ.600 ఆదా చేసుకునే అదిరిపోయే అవకాశాన్ని అందిస్తోంది. జియో దగ్గర ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది. దీనితో డేటా, కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లతో పాటు, క్యాష్‌బ్యాక్, రూ.600 విలువైన అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి ? దాని ధర ఎంత ? జియో రీఛార్జ్ ప్లాన్‌తో ఇంకేం ప్రయోజనాలను మనకు లభిస్తుంటాయో ఈ వార్తలో తెలుసకుందాం.
జియో రూ.1028 ప్లాన్
జియో అందిస్తున్న ఈ ప్రత్యేక ప్లాన్ ధర రూ.1028. ఈ ప్లాన్‌తో రిలయన్స్ జియో నుంచి ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అంతేకాదు, ఈ ప్లాన్‌తో జియో అన్‌లిమిటెడ్ ఆఫర్‌లో భాగంగా 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ (టీవీ, మొబైల్ యాక్సెస్) కూడా వస్తుంది.
Also Read: Urine Infection: మహిళల్లో పదే పదే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందా? అయితే ఇదే కారణం కావొచ్చు
హాట్‌స్టార్ బెనిఫిట్ కోసం ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు మంత్లీ ప్లాన్ వాడుతున్నట్లయితే హాట్‌స్టార్ బెనిఫిట్ కొనసాగాలంటే ప్లాన్ ముగియడానికి 48 గంటల ముందుగానే తర్వాతి ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవాలి. అప్పుడే రెండో, మూడో నెల జియో హాట్‌స్టార్ ప్రయోజనం కలుగుతుంది. దీనితో పాటు 50 జీబీ ఏఐ క్లౌడ్ స్టోరేజ్ బెనిఫిట్ కూడా ఈ ప్లాన్‌తో లభిస్తుంది.
స్విగ్గీ బెనిఫిట్స్, క్యాష్‌బ్యాక్
ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌తో స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీని ద్వారా జియో యూజర్లకు రూ.600 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి. అవేంటంటే:
* రూ.149 కంటే ఎక్కువ ఆర్డర్‌లపై 10 ఉచిత హోమ్ డెలివరీలు
* ఇన్‌స్టామార్ట్ నుండి రూ.199 కంటే ఎక్కువ ఆర్డర్‌లపై 10 ఉచిత హోమ్ డెలివరీలు
* ఫుడ్, ఇన్‌స్టామార్ట్ ఆర్డర్‌లపై సర్జ్ ఫీజు (అదనపు ఛార్జీలు) ఉండవు.
* 20 వేలకు పైగా ఫుడ్ డెలివరీ రెస్టారెంట్‌లలో 30శాతం వరకు అదనపు డిస్కౌంట్.
* స్విగ్గీ జెనీ నుంచి రూ.60 కంటే ఎక్కువ డెలివరీలపై 10శాతం డిస్కౌంట్.
* ఇవన్నీ కాకుండా, జియో రూ.1028 ప్లాన్‌ను రీఛార్జ్ చేసినందుకు రూ.50 క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తుంది.
Also Read: Tata Nano: అసంపూర్ణంగా రతన్ టాటా కోరిక.. తన డ్రీమ్ కారుతో ఆయన చేయాలనుకున్న పని ఇదే!
ప్లాన్ వ్యాలిడిటీ
రూ.1028 ప్లాన్ వ్యాలిడిటీ గురించి మాట్లాడుకుంటే… ఈ జియో ప్లాన్‌తో కంపెనీ 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ వద్ద ఫుడ్ డెలివరీ ప్రయోజనాలు అందించే ఎలాంటి రీఛార్జ్ ప్లాన్‌లు లేవు. కాబట్టి, జియో అందిస్తున్న ఈ ప్లాన్ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేసే వారికి మంచి అవకాశంగా చెప్పవచ్చు.
-
BSNL : బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్.. ఇక మీద ఇంటివద్దకే సిమ్ కార్డ్
-
Recharge Plan : జియో, ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్.. గంటల లెక్కన ఇంటర్నెట్ డేటా?
-
Satellite internet: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. డైరెక్ట్‌గా శాటిలైట్ ఇంటర్నెట్
-
Starlink : జియోలాంటి ప్లాన్స్‌తో స్టార్‌లింక్ ఎంట్రీ..ఇంటర్నెట్ మార్కెట్‌లో మస్క్ సంచలనం!
-
Jio vs Airtel Recharge Plans: రూ.50 తేడాతో భారీ ప్రయోజనాలు: జియో 299 vs ఎయిర్‌టెల్ 349 ప్లాన్ ఏది బెస్ట్ ?
-
IPL 2025: ఐపీఎల్ అంటేనే కాసుల క్రీడ.. దానికి ఎమోషన్లు కూడా ఉంటాయా?