WhatsApp : వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇకపై స్టేటస్ షేరింగ్ కూడా

WhatsApp : వాట్సాప్ తన వినియోగదారుల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సూపర్ ఫీచర్లను అందిస్తున్న వాట్సాప్, ఇప్పుడు చాలా మంది యూజర్లు ఎదురుచూస్తున్న ఒక ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది. అదే వాట్సాప్ స్టేటస్‌లను రీషేర్, ఫార్వర్డ్ చేసే ఆప్షన్. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? దీని వల్ల యూజర్లకు ఎలాంటి లాభాలుంటాయి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వాట్సాప్ కొత్త ఫీచర్
WABetaInfo నివేదిక ప్రకారం.. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 2.25.16.16 బీటా వెర్షన్లో ట్రయల్ కోసం ప్రారంభించబడింది. WABetaInfo తమ X (ట్విట్టర్) హ్యాండిల్లో ఈ ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. ఆ స్క్రీన్‌షాట్‌లో మీరు కొత్త ఫీచర్‌ను చూడవచ్చు.
Read Also :Monalisa: స్టైల్ మార్చిన ‘వైరల్ గర్ల్’.. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన మోనాలిసా
📝 WhatsApp beta for Android 2.25.16.16: what’s new?
WhatsApp is working on an optional feature to allow resharing and forwarding status updates, and it will be available in a future update!https://t.co/4RN5DSSMPs pic.twitter.com/kFbZnZrVWB
— WABetaInfo (@WABetaInfo) May 13, 2025
ఈ ఫీచర్ ద్వారా మీరు పెట్టిన స్టేటస్‌ను ఇతరులు షేర్ చేయవచ్చా లేదా అని నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం, ఎవరైనా మిమ్మల్ని స్టేటస్‌లో మెన్షన్ చేస్తేనే మీరు దానిని షేర్ చేయగలరు. కానీ ఈ కొత్త ఫీచర్ వచ్చిన తర్వాత యూజర్లు సాధారణంగానే స్టేటస్‌లను షేర్ చేయగలుగుతారు. ఎవరైనా మెన్షన్ చేయకపోయినా, మీ స్టేటస్‌ను ఇతరులకు పంపవచ్చు. ఈ ఫీచర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ షేరింగ్‌ను పోలి ఉంటుంది.
Read Also :Meta: మేటా స్మార్ట్ గ్లాసెస్ చూశారా.. ఫీచర్లు అయితే అదుర్స్
వాట్సాప్ స్టేటస్‌పై కంట్రోల్
వాట్సాప్‌లో మీకు ఒక ప్రత్యేకమైన టోగుల్ కనిపిస్తుంది. దాని ద్వారా మీరు మీ స్టేటస్‌ను పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా డిసేబుల్ చేయబడి ఉంటుంది. మీరు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తేనే మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని ఇతరులు మీ స్టేటస్ అప్డేట్లను షేర్ చేయగలరు. దీని వల్ల మీ ప్రైవసీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. మీరు ఎవరినైతే అనుమతిస్తారో వారు మాత్రమే మీ స్టేటస్‌ను చూడగలరు. అలాగే, మీరు సెలక్ట్ చేసుకున్న కాంటాక్ట్‌లు మాత్రమే మీ స్టేటస్‌ను షేర్ చేయగలరు.