Harish Rao: స్పీకర్ ను నిలదీసిన హరీష్ రావు.. వైరల్ వీడియో
Harish Rao: బుద్దిమాంద్యం అంటూ తెలంగాణ అసెంబ్లీ సభలో మాట్లాడిన బీఆర్ఎస్ నేత హరీష్ రావును అది తప్పని.. అలా మాట్లాడవద్దని స్పీకర్ కోరారు. అయితే దీనికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చాడు. అసెంబ్లీలో సభా నాయకుడు అయిన రేవంత్ రెడ్డి ‘బట్టలూడదీసి కొడతా.. ఉరికిచ్చి కొడతా.. ఊరేగిస్తా’ అంటే తప్పులేదు కానీ.. నేను బుద్దిమాంద్యం అంటే తప్పు వచ్చిందా? ముందు సీఎం రేవంత్ కు చెప్పండి అని స్పీకర్ ను హరీష్ రావు నిలదీసిన వీడియో వైరల్ అవుతోంది.
ఇదెక్కడి న్యాయం అధ్యక్షా
రేవంత్ రెడ్డి బట్టలూడదీసి కొడతా అంటే ఏం అనలేదు
నేను బుద్ధి మాంద్యం అంటే అభ్యంతరం తెలపడం కరెక్టా అధ్యక్షా – హరీష్ రావు https://t.co/IX5SdQ7Mjq pic.twitter.com/l1t5DVPeWc
— Telugu Scribe (@TeluguScribe) March 21, 2025