Heroine Poonam Kaur: చంద్రబాబుతో హీరోయిన్ పూనం కౌర్.. హాట్ టాపిక్
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచుగా సినీ పరిశ్రమలోని ఇద్దరు ప్రముఖులపై రెచ్చగొట్టే వ్యా్ఖ్యలు చేస్తుంటుంది. ప్రతీ విషయంపై స్పందిస్తుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రతీ వాటికి స్పందిస్తుంది.

Heroine Poonam Kaur: టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచుగా సినీ పరిశ్రమలోని ఇద్దరు ప్రముఖులపై రెచ్చగొట్టే వ్యా్ఖ్యలు చేస్తుంటుంది. ప్రతీ విషయంపై స్పందిస్తుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రతీ వాటికి స్పందిస్తుంది. అయితే పూనమ్ కపూర్ ఇటీవల జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో కనిపించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కనిపించింది. సీఎంకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చింది. ఈ విషయాన్ని పూనమ్ కపూర్ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేసింది. అయితే పూనమ్ కౌర్ ఫొటోలో గతంలో ఉన్నట్లు లేదు. అప్పటి కంటే కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో నెటిజన్లు ఇలా ఏంటి అయిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. పూనమ్ కౌర్ బహిరంగ సభలో కలవడంతో ఈమెకు చంద్రబాబు నాయుడు అంటే గౌరవం ఉంది ఏమోనని కొందరు భావిస్తున్నారు. మరికొందరు రాజకీయాల్లోకి పూనమ్ కౌర్ ఎంట్రీ ఇస్తుంది ఏమోనని అంటున్నారు. పూనమ్ చంద్రబాబు నాయుడికి ఓ ఆర్ట్‌ను బహుమతిగా ఇచ్చింది. అయితే ఆ ఆర్ట్ అమరావతి అభివృద్ధిని ప్రతిబింబించేలా ఉంది.
Read also: యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? కొల్లాజెన్ థ్రెడ్ ట్రీట్‌మెంట్ తీసుకోండి
పూనమ్ కౌర్ టాలీవుడ్‌లో ఒక క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. ఫస్ట్‌లో పూనమ్ కౌర్ హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్‌గా కనిపించింది. అయితే పూనమ్ 2018 తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంతో పాటు రాజకీయాలపై కూడా స్పందిస్తుంటుంది. సినిమాలకు దూరమైన కూడా ఎప్పటికప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్‌పై ఎప్పటికప్పుడూ విమర్శలు చేస్తుంటుంది. ఇన్ డైరెక్ట్‌గా కాకుండా డైరెక్ట్‌గానే డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు చేస్తుంటుంది.
పూనమ్ కౌర్ అప్పుడు స్లిమ్‌గా ఉండేది. ఇప్పుడు కాస్త బొద్దుగా తయారు అయ్యింది. దీంతో ఆమె అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుందని ఫ్యాన్స్ కాస్త ఆందోళణ చెందుతున్నారు. అయితే పూనమ్ కౌర్ కొన్ని రోజుల కిందట తన ఆరోగ్య పరిస్థితి బాలేదని తెలిపింది. పూనమ్‌కు ఫుడ్ అలెర్జీ ఉందని దీంతో పాటు ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి కూడా ఉన్నట్లు తెలిపింది. వీటి వల్ల తన శరీరం ఉబ్బుతుందని వెల్లడించింది. ఈ కారణంగానే కాస్త లావుగా అవుతున్నట్లు తెలిపింది. సన్నగా ఉన్న పూనమ్ బొద్దుగా కావడానికి అనారోగ్య సమస్యలే కారణమని తెలుస్తోంది.