Ap: గర్భిణులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ వస్తువులన్నీ ఇకపై ఫ్రీ

Ap: ఏపీ ప్రభుత్వం గర్భిణులకు గుడ్ న్యూస్ తెలిపింది. గర్భిణులకు లబ్ధి చేకూరే విధంగా కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని మళ్లీ ప్రారంభించనున్నట్లు ఏపీ సర్కార్ తెలిపింది. ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్‌ను అందించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రూ.51.14 కోట్ల నిధులను ఈ పథకం కోసం ప్రభుత్వం విడుదల చేసింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రారంభించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో ఈ ఎన్టీఆర్ కిట్‌ను వైసీపీ ఇవ్వలేదు. అయితే గతేడాది జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
చంద్రబాబు నాయుడు మళ్లీ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 1410 రూపాయల ఖర్చుతో ఈ ఎన్టీఆర్ బేబీ కిట్‌ను గర్భిణులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ కిట్‌లో దోమల నెట్‌తో పాటు ఇతర సామాన్లు కూడా ఉంటాయి. అయితే కూటమి ప్రభుత్వం వీటిని త్వరలోనే రిలీజ్ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చ ఈ బేబీ కిట్ పథకంలో రూ.1410 ల వస్తువులు ఉంటాయి. దోమతెర, దుప్పటి, స్లీపింగ్ బెట్, యాంటీ సెప్టిక్ లోషన్‌తో పాటుగా నాప్‌కిన్, డైపర్లు, షాంపూ వంటివి మొత్తం 11 రకాల వస్తువులు ఉంటాయి. అయితే వీటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన తల్లులకు మాత్రమే ఇస్తారు. ఆసుపత్రి నుంచి ఎప్పుడు అయితే డిశ్చార్జ్ అవుతారో అప్పుడు మాత్రమే ఉచితంగా అందజేస్తారు.
ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం గర్భిణుల కోసం జననీ మిత్ర పేరుతో ఒక యాప్‌ను కూడా రూపొందించింది. గర్భిణులు ఆరోగ్య పరిస్థితులను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం వంటి విషయాలను తెలియజేస్తుంది. అలాగే రక్తహీనత వంటి సమస్యలను గర్భిణుల్లో ముందుగానే గుర్తిస్తుంది. ఈ యాప్‌లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎమ్‌లతో లింక్ అయి ఉంటుంది. మందులు, వైద్య పరీక్షలు, ప్రభుత్వ ప్రయోజనాలు ఇలా అన్ని వివరాలను కూడా ఈ యాప్ ద్వారా ట్రాక్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి అలయన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెడ్‌టెక్ కన్సార్టియంతో ఎంవోయూ కుదుర్చుకుంది. సిగ్నల్ లేని ప్రాంతంలో కూడా పనిచేసే విధంగా దీన్ని తయారు చేశారు. సిగ్నల్ సమస్య ఉన్న దగ్గర కేవలం ఒక్క క్లిక్‌తో దీన్ని ఉపయోగించవచ్చు.
-
Chandrababu : మోదీ ప్రశంసలు అందుకున్న చంద్రబాబు.. ఏపీ అభివృద్ధి మోడల్‌ను ఇతర రాష్ట్రాలకు సిఫార్సు!
-
ITR: ఐటీఆర్ ఫైలింగ్.. జరిమానా లేకుండా ఎప్పటి లోగా రిటర్న్ దాఖలు చేయవచ్చంటే?
-
AP Government: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగస్థులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్
-
Heroine Poonam Kaur: చంద్రబాబుతో హీరోయిన్ పూనం కౌర్.. హాట్ టాపిక్
-
AP: సీనియర్ సిటిజన్లకు అదిరిపోయే న్యూస్.. ఇకపై ఆ చికిత్సలన్నీ ఉచితమే
-
Renu Desai: ఇకపై ఆ వస్తువులు బ్యాన్ చేయండి.. దేశ ప్రజలకు రేణు దేశాయ్ రిక్వెస్ట్.. వైరల్ పోస్ట్