AP Government: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగస్థులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్

AP Government: కూటమి సర్కార్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగస్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. జనాభా ప్రాతిపదికన 7,715 గ్రూపులుగా విభజించింది. ఈ గ్రూపుల్లో ఇంజనీరింగ్, ఎనర్జీ అసిస్టెంట్, వీఆర్వో లేదా సర్వే అసిస్టెంట్, ఏఎన్ఎం తప్పకుండా ఉండేలా ప్లాన్ చేసింది. అలాగే సాగు వంటి అవసరాలకు అదనంగా సిబ్బందిని నియమించాలని ప్లాన్ చేస్తోంది. అయితే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఏపీ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో మార్పులు జరిగాయి.
ఇది కూాడా చూడండి: War 2 Movie: ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ డైలాగ్‌లు లీక్.. థియేటర్లలో గూస్‌బంప్సే
ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో అధికారులను గ్రూపులుగా విభజించనుంది. వీరిని సంబంధిత సచివాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులను పునర్విభజన చేసింది. ఈ క్రమంలోనే కూటమి సర్కార్ గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు అందరికీ కూడా ఇటీవల ఉత్తర్వులను పంపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నట్లు తెలుస్తోంది. 7,715 గ్రూపులుగా వీటిని విభజించాలని ఏపీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు పంపినట్లు తెలుస్తోంది.
ఇది కూాడా చూడండి:Bigg Boss 9: నాగార్జున్ ఔట్.. బాలయ్య ఇన్.. హోస్టింగ్‌పై క్లారిటీ ఇదే!
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని సచివాలయాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ అనేది అధికారికంగా ప్రారంభమైంది. అన్ని సచివాలయాలలో జనాభా ప్రాతిపదికన ఉన్న ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే సచివాలయంలో ఏయే కేటగిరీలో పోస్టులను భర్తీ చేయాలనే విషయంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే ప్రతీ ఒక సచివాలయంలో తప్పకుండా ఇంజనీర్ అసిస్టెంట్ లేదా ఎనర్జీ అసిస్టెంట్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేదా సర్వే అసిస్టెంట్, అసిస్టెంట్ నర్స్ మిడ్ వైఫరీ ఉండేలా ఉండాలి. వీరు ఉండే విధంగా విభజించాలని భావిస్తోంది. అలాగే కొన్ని ప్రాంతాలలో ఉన్న సాగు పరిస్థితులను బట్టి ఆఫీసర్లను నియమించనున్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ లేదా సెరికల్చర్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించబోతుంది. అలాగే వీరితో పాటు అసిస్టెంట్ లేదా వెటర్నరీ అసిస్టెంట్లలో ఒకరిని కూడా ప్రాంతాన్ని బట్టి సచివాలయంలో నియమించనుంది. ఇంకా ఎవరైనా అదనపు సిబ్బంది కావాలంటే ప్రభుత్వం నియమించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతీ సచివాలయంలో ఉండే గ్రూప్‌లో ప్రతీ సిబ్బంది ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చూడాలి.
ఇది కూాడా చూడండి: Gmail : టైమ్ సేవింగ్ ట్రిక్స్.. Gmailలోని ఈ 4 అద్భుతమైన ఫీచర్లను తెలుసుకోండి