Aadhar: ఆధార్ అప్‌డేట్ ఇంకా చేసుకోలేదా.. ఇది మీ కోసమే

Aadhar: భారతదేశంలో ఆధార్ కార్డు ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదు.. ప్రతి పౌరుడికి కీలకమైన డిజిటల్ గుర్తింపు సాధనం. ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకింగ్ సేవలు, విద్యా సంబంధిత లావాదేవీలు ఇలా అన్నింటికి కూడా ఆధార్ తప్పకుండా ఉండాలి. అందులో వ్యక్తిగత వివరాలు, పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, బయోమెట్రిక్ వంటి వివరాలు ఉంటాయి. అయితే ఈ మార్పులను ఆధార్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త సమాచారంతో అప్‌డేట్ కూడా చేసుకోవాలి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ ఆధార్ నియంత్రణ సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ వివరాలను ఉచితంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే గడువును మరో సంవత్సరం పాటు పెంచింది. అంటే 2026 జూన్ 14వ తేదీ వరకు పొడిగించింది. అయితే ఉచితంగా ఆధార్ అప్‌డేట్ అనేది myAadhaar పోర్టల్ ద్వారా మాత్రమే అవుతుంది. లక్షలాది మంది ఆధార్ నంబర్ హోల్డర్లుకు ఉపయోగపడాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే UIDAI ద్వారా మీరు మీ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ ఉచిత గడువు ముగిసిన తర్వాత, ఆధార్ అప్‌డేట్‌కు రుసుము చెల్లించాల్సి ఉంటుందని UIDAI స్పష్టం చేసింది. కాబట్టి ఇప్పుడే ఫ్రీగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోండి. ఆధార్ పొందినప్పటి నుంచి 10 సంవత్సరాలు పూర్తయిన వారందరూ తమ గుర్తింపు రుజువు, చిరునామా రుజువు పత్రాలను అప్‌లోడ్ చేసి అప్‌డేట్ చేసుకోవాలని UIDAI తెలిపింది.
మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. లేకపోతే ఏ పని కూడా జరగదు. బ్యాంకింగ్, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ, ఆన్‌లైన్ సేవలు సక్రమంగా పూర్తవుతాయి. దేనికైనా ఆధార్ లేకపోతే కుదరదు. పనులు అన్ని కూడా మధ్యలోనే ఆగిపోతాయి. ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడం కూడా ఈజీ. myAadhaar పోర్టల్‌లోకి వెళ్లి అప్‌డేట్ చేసుకోవాలి. అధికారిక https://myaadhaar.uidai.gov.in/ పోర్టల్‌ని సందర్శించి myAadhaar పోర్టల్‌ని ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లాలి అక్కడ My Aadhaar అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత Update Your Aadhaarపై క్లిక్ చేస్తే అవుతుంది. మీరు మార్చాలని అనుకున్నవి మార్చి అప్‌డేట్ చేస్తే మీకు 12 అంకెల ఆధార్ నంబర్, కాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత ‘Send OTP’పై క్లిక్ చేయండి. ఇలా చేస్తే మీరు ఆధార్‌లో ఏదైనా అప్‌డేట్ చేసుకోవచ్చు.
Read Also:Mahindra : ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీ – కొత్త హైబ్రిడ్ మోడళ్లతో మహీంద్రా సంచలనం
-
Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?
-
Zodiac Signs: ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ మాయం.. ఈ రాశుల వారి పంట పండినట్లే