Bank Deposit: బ్యాంకు అకౌంట్ ఉందా.. ఈ శుభవార్త మీ కోసమే.. రూ.12 లక్షల క్రెడిట్ గ్యారెంటీ

Bank Deposit: బ్యాంకు అకౌంట్ అనేది అందరికీ ఉంటుంది. డబ్బులు దాచుకోవడానికి లేదా స్కాలర్‌షిప్‌లు ఇలా ఏదో ఒక అవసరానికి అకౌంట్లు ఉంటాయి. అయితే కొన్ని చిన్న బ్యాంకుల్లో కొందరు ఫ్రీగా అకౌంట్ ఇస్తారని తీసుకుంటారు. తీరా అందులో డబ్బులు ఎక్కువ మొత్తంలో దాచిన తర్వాత ఆ బ్యాంకులు దివాళా తీస్తాయి. దీంతో మనం దాచిన డబ్బు అంతా కూడా వేస్ట్ అవుతుంది. అయితే ఇకపై అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ బ్యాంకు దివాళా తీసినా లేకపోతే బ్యాంకు ఖాతా, ఎఫ్‌డిలో ఉంచిన డబ్బు కూడా పోకుండా చాలా సురక్షితంగా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇస్తుంది. సడెన్‌గా బ్యాంకు దివాళా తీస్తే.. మీరు కట్టిన డబ్బుకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఈ క్రమంలోనే క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. బ్యాంకు డిపాజిట్లపై బీమాను రూ.8 నుంచి 12 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది సేవింగ్స్ అకౌంట్, ఎఫ్‌డి అకౌంట్స్ ఉన్నవారికి మాత్రమే రూ.12 లక్షల వరకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లపై బీమా కవర్ కేవలం రూ.5 లక్షల వరకు మాత్రమే ఉంది. కానీ ఇకపై దీన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
డిపాజిట్ బీమా పరిమితిని పెంచే విషయంలో ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకుంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు డిపాజిట్లపై బీమా రక్షణను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది పూర్తిగా ఆర్బీఐ అండర్‌లో ఉన్న బ్యాంకుల డిపాజిట్లపై మాత్రమే నిర్వహిస్తుంది. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్థానిక ప్రాంత బ్యాంకులు, సహకార బ్యాంకులలో ఉన్న అన్ని డిపాజిట్లపై కూడా నిర్వహిస్తారు. అయితే ఒక్కో వ్యక్తికి వేర్వేరు బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటాయి. ఇలా ఎన్ని బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే అన్నింట్లో కూడా బీమా కవరేజ్ ఉంటుంది. కానీ ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటుంది. ఒక్కో బ్యాంకు బట్టి కవరేజ్‌ను ఇస్తారు. ఇకపై మీరు ఎలాంటి బ్యాంకులో అయినా డిపాజిట్ చేస్తే సమస్య ఉండదు. మీ డబ్బులు పోతాయనే ఆలోచన కూడా ఉండదు. బ్యాంకు దివాళా తీసినా కూడా మీ డిపాజిట్‌పై బీమా వస్తుంది. కాబట్టి ఇకపై ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా అన్ని బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేయవచ్చు.