Honda Electric Bike: హోండా ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరిగిపోతారు
Honda Electric Bike: హోండా కంపెనీ బైక్‌లను చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే దీని ఫీచర్లు అన్ని కూడా బాగుంటాయి. ఈ బైక్‌లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో హోండా కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను తీసుకొచ్చింది.

Honda Electric Bike: నిజానికి అబ్బాయిలకు బైక్‌లు అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో వారు మార్కెట్‌లోకి కొత్తగా ఏ బైక్ వచ్చినా కూడా కొనుగోలు చేస్తుంటారు. ప్రతీ కంపెనీ కూడా మార్కెట్‌లోకి రకరకాల మోడల్స్ బైక్‌లను ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటుంది. అయితే హోండా కంపెనీ బైక్‌లను చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే దీని ఫీచర్లు అన్ని కూడా బాగుంటాయి. ఈ బైక్‌లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో హోండా కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం చాలా మంది ఎలక్ట్రిక్ బైక్‌లు వాడుతున్నారు. ఈ క్రమంలోనే హోండా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ను చైనా మార్కెట్‌లో ఈ-విఓను ఆవిష్కరించింది. స్థానిక కంపెనీ సహకారంతో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేసింది. రూ.3.56 లక్షల నుంచి రూ. 4.39 లక్షల వరకు మార్కెట్లో ఈ హోండా బైక్ ధర ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అయితే హోండా ఈ-విఓ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో మార్కెట్‌లోకి వస్తుంది. దీనికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపుగా 170 కిలోమీటర్ల రేంజ్ వరకు అందిస్తుంది. అయితే ఈ బైక్‌ను త్వరలోనే భారత్‌లో లాంఛ్ చేయనున్నారు.
హోండా ఈ-విఓ 16 అంగుళాల ముందు, వెనుక 14 అంగుళాలు ఉంటుంది. అలాగే దీనికి సెమీ-స్లిక్ టైర్లు ఉన్నాయి. ఈ హోండా బైక్ బరువు 143 కిలోలు ఉంటుంది. ఇది డిఫరెంట్ వేరియంట్లలో 156 కిలోల వరకు ఉంటుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా స్టాండర్డ్ ఫీచర్‌గా ఉంది. అయితే బ్లాక్ అండ్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఇది ఉంది. నావిగేషన్, 7 అంగుళాల టీఎఫ్‌టీ డ్యాష్‌బోర్డ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మ్యూజిక్ కంట్రోల్, బ్యాటరీ ఎస్ఓసీ వంటి ప్రత్యేకతలు కూడా ఈ హోండా బైక్‌కి ఉన్నాయి. అలాగే నార్మల్, బైక్ ఎకో, స్పోర్ట్ వంటి మూడు రైడ్ మోడ్‌లు కూడా ఈ బైక్‌కి ఉన్నాయి. దీని వేరియంట్ 120 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇస్తుంది. అలాగే 6.2 కిలో వాట్ల గ్రేడ్ ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది దాదాపుగా 170 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. పోర్టబుల్ ఏసీ హోమ్ ఛార్జర్ ద్వారా చేయవచ్చు. అయితే ఫస్ట్ ఒక గంట 30 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. అలాగే రెండో దాన్ని కూడా 2 గంటల 30 నిమిషాల్లో దీన్ని ఈజీగా కూడా ఛార్జ్ చేయవచ్చు. గరిష్టంగా అయితే 20.5 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Tesla Enters India: భారత్ లోకి అడుగుపెట్టిన టెస్లా.. ధర, ఫీచర్లు ఇవే
-
Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?