RBI : ఆర్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. ఇకపై ఛార్జీలు
RBI : ప్రస్తుతం రోజుల్లో అయితే ఏటీఎంకి వెళ్లి డబ్బులు తీస్తున్నారు. ఒకసారి ఏంటి ఎన్నిసార్లు డబ్బులు అవసరం అయితే అన్నిసార్లు ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు. అయితే ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్న వారికి ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు తీసినా ఛార్జ్ ఉండదు. కానీ ఇకపై మాత్రం ఛార్జీలు ఉంటాయని తెలిపింది

RBI : డబ్బులు అనేవి ప్రతీ ఒక్కరికి అవసరం. కొందరు ఇంట్లో దాచుకుంటే మరికొందరు బ్యాంకుల్లో దాచుకునే వారు. అయితే వీటిని అవసరం అయినప్పుడు తీస్తుంటారు. గతంలో అయితే డైరెక్ట్‌గా బ్యాంకుకు వెళ్లి తీసుకునే వారు. కానీ ప్రస్తుతం రోజుల్లో అయితే ఏటీఎంకి వెళ్లి డబ్బులు తీస్తున్నారు. ఒకసారి ఏంటి ఎన్నిసార్లు డబ్బులు అవసరం అయితే అన్నిసార్లు ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు. అయితే ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్న వారికి ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు తీసినా ఛార్జ్ ఉండదు. కానీ ఇకపై మాత్రం ఛార్జీలు ఉంటాయని తెలిపింది. నెలకు కేవలం ఒకసారి మాత్రమే విత్ డ్రా ఉచితం. ఒకసారి కంటే ఎక్కువ సార్లు డబ్బులు తీస్తే డబ్బులు విధిస్తారు. అయితే ఈ రూల్ అనేది మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అయితే ఇక నుంచి ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి నగదు తీయాలంటే మాత్రం రూ.17 కట్ అవుతుంది. అలాగే చెక్ చేయడానికి రూ.7 ఛార్జీలు విధించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. కానీ ఇకపై ఈ ఛార్జీలు పెరగనున్నాయి.
ప్రస్తుత కాలంలో ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు బాగా పెరిగాయి. మొత్తం డిజిటల్ కావడంతో అందరూ కూడా ఏటీఎం, యూపీఐ ఇలానే వాడుతున్నారు. మనిషికి తిండి ఎంత ఇంపార్ట్టెంట్.. అలాగే డిజిటల్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఏ వస్తువు కొనాలన్నా కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఆర్డర్ పెడుతున్నారు. ఎంత ఇలా అయినా కూడా కొన్నిసార్లు నగదు వాడుతున్నారు. ఇప్పటికీ కొందరు ఆన్లైన్ పేమెంట్స్ కాకుండా నెట్ క్యాష్ వాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఇక ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేస్తే తప్పకుండా ఈ ఛార్జీలు చెల్లించాలి.
మీరు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు రూ.21 కట్ అవుతుంది. అయితే ఈ మార్పులను మే 1వ తేదీ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి తీసుకురానుంది. అయితే ప్రస్తుతం నెలకు ఐదుసార్లు డబ్బులు తీసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఛార్జీలు లేవు. దీని కంటే ఎక్కువగా విత్ డ్రా చేస్తే మాత్రం తప్పకుండా ఛార్జీలు వర్తిస్తాయి. కీలక మార్పులను తీసుకురానుంది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం..కస్టమర్లకు నెలకు ఐదు ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఈ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్ డ్రా చేయడానికి ఛార్జీలు వర్తిస్తాయి. అయితే ఈ ఏటీఎం ఇంటర్ ఛేంజ్ ఫీజులు త్వరలోనే పెరగనున్నాయి. అయితే ఈ ఛార్జీలను కూడా పెంచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భావిస్తోంది.