Telangana Dost Notification: తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే!
Telangana Dost Notification దోస్ట్ నోటిఫికేషన్ ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా వీటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీనికి రూ.200 ఫీజు చెల్లించి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Telangana Dost Notification: ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు చాలా మంది డిగ్రీలో జాయిన్ కావడానికి వెయిట్ చేస్తున్నారు. మంచి కాలేజీలో చదవాలని అనుకుంటారు. కొందరు ప్రైవేట్ కాలేజీలో చదివితే మరికొందరు ప్రభుత్వ కాలేజీలో చదువుతారు. అయితే తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదవడానికి సీట్లను భర్తీ చేయనున్నారు. అయితే ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకునే వారికి మొత్తం మూడు విడతల్లో ప్రవేశాలను పూర్తి చేస్తుంది. అయితే ఈ దోస్ట్ నోటిఫికేషన్‌లో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుని.. ఈజీగా మీకు నచ్చిన కాలేజీలో చదవచ్చు. అయితే ఈ దోస్ట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
దోస్ట్ నోటిఫికేషన్ ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా వీటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీనికి రూ.200 ఫీజు చెల్లించి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే దీనికి చివరి తేదీ మే 21. ఈ తేదీలోగా అప్లై చేసుకుంటే.. మీకు మే 29న మొదటి ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇందులో అప్లై చేసుకున్న వారు ఈ మొదటి ఫేజ్‌లోనే కాలేజీలో జాయిన్ కావచ్చు. ఇక రెండో విడత కింద అయితే మే 30 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఇవి జూన్ 8 వరకు రిజిస్ట్రేషన్లు అవుతాయి. అయితే మీరు మే 30 నుంచి జూన్ 9 వరకు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఈ సెకండ్ ఫేజ్‌లో జూన్ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక మూడో విడత ప్రక్రియ అయితే జూన్ 13వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. దీనికి చివరి తేదీ జూన్ 19వ తేదీ. వీటికి మీరు జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకుంటే.. జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే ఫస్ట్ ఫేజ్‌లో సీట్లు పొందే విద్యార్థులు మే 30వ తేదీ నుంచి జూన్ 6లోపు సీటు లభించిన కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత రెండో, మూడో విడతలో కూడా ఇలానే చేయాలి. లేకపోతే మీ సీటు క్యాన్సిల్ అవుతుంది. అయితే ఈ ఏడాది డిగ్రీ విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్ తరగతులు జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.
ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు డిగ్రీ చదవడం కోసం దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే కాలేజీ, స్కోర్, రిజర్వేషన్ ఆధారంగా వారికి సీట్లు కేటాయింపు ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవాలంటే dost.cgg.gov.in/welcome.do వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. దోస్త్ రిజిస్ట్రేషన్ల ద్వారా తెలంగాణలో ఉన్న కాలేజీలో అవకాశాలు కల్పిస్తారు. ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ వర్శిటీ,చాకలి ఐలమ్మ, శాతవాహన వంటి యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. గతేడాది డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను అయితే మొత్తం 3 విడతల్లో పూర్తి చేశారు. అయితే ఈ సారి కూడా 3 విడతల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ఒకవేళ సీట్లు మిగిలితే స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్లు కూడా విడుదల చేయనున్నారు. అయితే ఈ వెబ్‌సైట్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల అప్డేట్స్ అన్ని కూడా ఈజీగా తెలుసుకోవచ్చు.
-
AP Telangana Theaters Closed : ఏపీ, తెలంగాణలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్
-
Vanajeevi Ramaiah: వనజీవి రామయ్య ఇకలేరు.. ఇంతకీ ఎవరీతను?
-
Telangana : నువ్వు ఉచితాలు ఇవ్వకుంటే.. ఉద్యోగాలు వచ్చేవి.. రేవంత్ పై మాజీ ఉద్యోగి ఫైర్..
-
Richest Village In Telangana : తెలంగాణలోనే అత్యంత ఖరీదైన గ్రామం ఇది.. ఇంతకీ ఇది ఎక్కడ ఉందో తెలుసా?