Loco Pilot Exam : లోకో పైలట్ పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్థులకు అలెర్ట్
Loco Pilot Exam : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) లోకో పైలట్ సీబీటీ 2 పరీక్షలను రైల్వే శాఖ వాయిదా వేసింది. నిజానికి పరీక్ష మార్చి 19వ తేదీ రెండు షిఫ్ట్లలో జరగాలి. అయితే కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో ఆర్ఆర్బీ పరీక్షలను పోస్ట పోన్ చేసింది. ఇప్పుడు ఈ పరీక్షకు సంబంధించిన కీలక అప్ డేట్ను వెల్లడించింది

Loco Pilot Exam : సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడప్పుడు నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే రైల్వే అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. ఈ ఉద్యోగం రావడానికి ఎంతో ప్రయత్నిస్తారు. నోటిఫికేషన్ ఎప్పుడు పడితే అప్పుడు రాదు. కొన్నిసార్లు మాత్రమే వస్తుంది. కాబట్టి వచ్చినప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే కొన్నిసార్లు పరీక్షలు వాయిదా కూడా పడతాయి. ఇలా వాయిదా పడిన పరీక్షలను ఇప్పుడు నిర్వహించనుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) లోకో పైలట్ సీబీటీ 2 పరీక్షలను రైల్వే శాఖ వాయిదా వేసింది. నిజానికి పరీక్ష మార్చి 19వ తేదీ రెండు షిఫ్ట్లలో జరగాలి. అయితే కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో ఆర్ఆర్బీ పరీక్షలను పోస్ట పోన్ చేసింది. ఇప్పుడు ఈ పరీక్షకు సంబంధించిన కీలక అప్ డేట్ను వెల్లడించింది. ఈ పరీక్షల తేదీలను ప్రకటించింది. అయితే కొత్త రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం అయితే మే 2, 6 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 07:30 గంటల నుంచి 12:30 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది.
ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను కూడా త్వరలో వెబ్సైట్లో రిలీజ్ చేయనుంది. అయితే రైల్వే ఈ రిక్రూట్మెంట్ ద్వారా 18,799 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అయితే ఇందులో కేవలం సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలోనే 2,528 ఖాళీలు ఉన్నాయి. వీటిని రైల్వే శాఖ భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను గతేడాది నవంబర్ 25, 26, 27, 28, 29 తేదీల్లో నిర్వహించారు. వీటి ఫలితాలు కూడా రిలీజ్ చేశారు. వీటికి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం ఉంటుంది.