Aha Subscription : కేవలం రూ.67లకే ఆహా సబ్‌స్క్రిప్షన్
Aha Subscription: ఆహా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలని అనుకుంటారు. కానీ డబ్బులు ఎక్కువగా ఉంటాయని తీసుకోరు. ఇలాంటి వారికి ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తక్కువ డబ్బులకే ఆహా బెస్ట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదేంటో మీకు తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Aha Subscription : ప్రస్తుతం చాలా మంది ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ వాడుతున్నారు. దేశంలో ఎన్నో రకాల ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. అయితే వీటిలో మీకు నచ్చిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడాలంటే మాత్రం తప్పకుండా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. వీటిలో ఒక్కో దానికి ఒక్కో రకమైన ప్లాన్ ధరలు ఉంటాయి. అయితే ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఆహా, ఈటీవీ విన్ ఓటీటీలను వాడుతుంటారు. అయితే తెలుగులో ఆహా ఓటీటీకి మంచి పాపులర్ ఉంది. చాలా మంది దీన్ని వాడుతుంటారు. తెలుగుతో పాటు అన్ని రకాల సినిమాలు అన్ని కూడా ఉంటాయి. అయితే చాలా మంది ఈ ఆహా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలని అనుకుంటారు. కానీ డబ్బులు ఎక్కువగా ఉంటాయని తీసుకోరు. ఇలాంటి వారికి ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తక్కువ డబ్బులకే ఆహా బెస్ట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదేంటో మీకు తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
ఆహా ఓటీటీ కేవలం 67 రూపాయలకే నెలవారి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ఖర్చు తక్కువ.. కానీ ఇచ్చే కిక్కు ఎక్కువ. ఈ చవకైనా ప్లాన్‌ను వేసుకుంటే.. నెల మొత్తం మీరు ఆహా ఓటీటీని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో మీరు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, గేమ్ షోస్, కుకరీ షోస్ అన్ని కూడా చూసి ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఆహాలో ఫన్ అండ్ థ్రిల్లింగ్ గేమ్ షో సర్కార్ సీజన్ 5, హోమ్ టౌన్, త్రీ రోజెస్ సీజన్ 2, అప్సర వంటి ఫ్రెష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేవి వస్తున్నాయి. తెలుగులో మీకు కావాల్సినవన్ని షోలు ఉన్నాయి. ఈ మంత్లీ ప్యాక్‌ను మీరు తీసుకుంటే.. మాత్రం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ 67 రూపాయల ఆహా ఓటీటీ ప్లాన్ యూజర్స్ కోసం మాత్రమే తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో హెచ్‌డీ రెజల్యూషన్‌తో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అన్ని కూడా క్లారిటీతో వస్తాయి. అలాగే యాడ్స్ కూడా ఇందులో వస్తుంటాయి. తక్కువ ఖర్చుకే మీరు ఇందులో అన్ని చూడవచ్చు. మిగతా ప్లాన్‌లతో పోల్చితే ఆహా ఓటీటీ ప్లాన్ చాలా తక్కువ. ఇది మీకు బెస్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు.
ఈ ప్లాన్‌ను కేవలం నెలకు మాత్రమే తీసుకోవడం కుదరదు. మూడు నెలలకు కలిపి ఈ ప్లాన్‌ను తీసుకోవాలి. అంటే నెలకు రూ.67 అయితే మీరు మూడు నెలలకు కలిపి రూ.201 చెల్లించి ప్లాన్ తీసుకోవాలి. అంతే కానీ మీకు కేవలం ఒక్క నెలకే ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ ఇవ్వదు. ఆహాలో ఇవే కాకుండా ఇంకా ఎక్కువ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మీ బడ్జెట్ బట్టి మీరు ప్లాన్‌లు తీసుకోవచ్చు. ఆహాలో యాన్యువల్ ప్లాన్ రూ.399 కే ఉంది. ఈ ప్లాన్‌లో ఫుల్ హెచ్‌డీ 1080పీ రెజల్యూషన్ క్లారిటీతో మీరు సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్ని కూడా చూడవచ్చు. అలాగే ఆహా గోల్డ్ ప్రీమియమ్ యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ రూ.699కి ఉంది. అయితే వీటిలో ఈ ప్లాన్ తీసుకుంటే ఒక ప్లస్ ఉంది. ఇందులో ఎలాంటి యాడ్స్ కూడా రావు.
-
Star Heroine : ఒక్క ఏడాదిలో 12 సినిమాలు రిలీజ్ చేసిన హీరోయిన్.. కానీ మరుసటి ఏడాది ఊహించని మరణం.. ఎవరంటే..
-
OTT Movie : ఓటీటీలోకి నేడు అదిరిపోయే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
-
Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?
-
New Movie In OTT : ఓటీటీలోకి వచ్చేసిన న్యూ మూవీస్.. స్ట్రీమింగ్ అందులోనే?
-
Pooja Hegde : కోట్లు పెట్టి కావాలనే నన్ను ట్రోల్ చేస్తున్నారు.. బుట్టబొమ్మ ఎమోషనల్
-
Cartoon Shows: ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా ఐదు కార్టూన్ షోలు ఓటీటీలోకి.. ఎప్పటినుంచంటే?