Masala Soda: ఫస్ట్ టైమ్ మసాలా సోడా.. బ్రిటిష్ అమ్మాయి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తే నవ్వొస్తుంది
నిమ్మకాయ, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి మసాలా సోడాను తయారు చేస్తారు. ఇది భారతదేశంలో చాలా పాపులారిటీ అయిన సోడా. ఇది సాధారణంగా పుల్లగా, ఉప్పగా, కొద్దిగా కారంగా ఉంటుంది.

Masala Soda: నిమ్మకాయ, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి మసాలా సోడాను తయారు చేస్తారు. ఇది భారతదేశంలో చాలా పాపులారిటీ అయిన సోడా. ఇది సాధారణంగా పుల్లగా, ఉప్పగా, కొద్దిగా కారంగా ఉంటుంది. మసాలాల వల్ల ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఇంట్లో కూడా దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. నిమ్మరసం, ఉప్పు, మసాలా పొడులు సోడాలో కలుపుకుంటే సరిపోతుంది.
Read Also: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కుబేరులు.. వీరి వెంటే డబ్బు
భారతదేశ సందర్శనకు వచ్చిన ఒక బ్రిటిష్ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ కేరళలో మొదటిసారిగా మసాలా సోడాను టేస్ట్ చేసింది. ఈ తర్వాత ఆమె ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయికి మసాలా సోడా రుచి ఎలా అనిపించిందో అది తెలుసుకోవాలంటే ఈ వీడియో మీద ఓ లుక్కేయాల్సిందే.
View this post on Instagram
ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ డీన్ లేహ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసింది. దానికి క్యాప్షన్‌గా “కేరళలో మొదటిసారి మసాలా సోడాను ప్రయత్నించాను. ఇది నిమ్మకాయ, ఉప్పు, జీలకర్ర, చాట్ మసాలా కలిపి తయారుచేసిన ఒక మసాలా కార్బోనేటెడ్ డ్రింక్” అని రాసింది.
Read Also: టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ రిటైర్మెంట్.. కారణమిదే!
వైరల్ అవుతున్న వీడియోలో, లేహ్ మసాలా సోడాను ఒక సిప్ చేయగానే ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్ చూస్తే అది ఆమెకు ఏ మాత్రం నచ్చలేదని స్పష్టంగా తెలుస్తోంది. పాలక్కడ్‌లోని ఒక లోకల్ షాప్‌లో ఆమెకు ఈ డ్రింక్ ఆఫర్ చేశారు. తనకు ఈ డ్రింక్ నచ్చకపోయినా, ఇతరులను మాత్రం ఒకసారి ప్రయత్నించమని ఆమె ప్రోత్సహించింది. బ్రిటిష్ మహిళ మాట్లాడుతూ, “మీకు అవకాశం వస్తే తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి” అని చెప్పింది. దీని రుచి చాలా స్ట్రాంగ్‌గా ఉందని, సాధారణంగా తను ఆర్డర్ చేసే డ్రింక్ ఇది కాదని ఆమె తెలిపింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 33 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్న లేహ్, ఇటీవల భారతదేశంలో తన ట్రావెల్ ఎక్స్ పీరియన్స్ వీడియోలను షేర్ చేస్తోంది. సిమ్లాలో హాలిడేస్ ఎంజాయ్ చేయడంతో పాటు, ఆమె ఆగ్రాలో తాజ్ మహల్ కూడా సందర్శించింది.
-
Funny Video: జూలో ఫన్నీ ఘటన.. ముద్దు పెట్టుకుంటున్న అమ్మాయి మీద ఉమ్మేసిన గొర్రె
-
Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!
-
Yellow: ఎల్లో కలర్ ఫేవరెట్.. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే?
-
Meta: మేటా స్మార్ట్ గ్లాసెస్ చూశారా.. ఫీచర్లు అయితే అదుర్స్
-
IPL: ఐపీఎల్‌లో మీనాక్షికి ఇష్టమైన జట్టు ఇదే
-
Beauty: లైగర్ బ్యూటీ ఫిటినెస్ సీక్రెట్ ఇదే