RCB Stampede : తొక్కిసలాట క్రియేట్ చేసిందే..ఆర్సీబీ సంబరాల్లో విషాదంపై నటి రమ్య సంచలన వ్యాఖ్యలు!

RCB Stampede : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ కప్ గెలిచినప్పుడు జరిగిన సంబరాలు విషాదంగా మారాయి. ఈ వేడుకల్లో 11 మంది అమాయకులు తొక్కిసలాట (Stampede) కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దురదృష్టకర సంఘటనపై ఇప్పుడు నటి రమ్య తీవ్రంగా స్పందించారు. ఆమె ఈ ఘటనకు సంబంధించిన కారణాలు, అధికారుల బాధ్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రమ్య ఆవేదన
రమ్య మాట్లాడుతూ.. “ఆర్సీబీ గెలిచిన రాత్రి కర్ణాటక అంతటా సంబరాలు జరిగాయి. మాల్స్‌లో, రోడ్లపై ప్రజలు ఆనందంగా డ్యాన్స్ చేశారు. అప్పుడు ఎక్కడా ఎలాంటి గొడవ జరగలేదు. కానీ, ఈ తొక్కిసలాటలు అకస్మాత్తుగా జరగవు, వాటిని సృష్టించినట్లే ఉంటుంది” అని అన్నారు.
“ప్రభుత్వం, అధికారులు, ఆర్సీబీ, పోలీసులు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA), ప్రజలు – వీరందరి సమష్టి వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది. క్రీడా విజయాన్ని వేడుక చేసుకునేందుకు వచ్చిన అమాయకులు మరణించారు. ఈ మరణాలకు కారణాలను కనుగొని, వారికి న్యాయం అందించడానికి నిజాయితీతో కూడిన ఆత్మపరిశీలన అవసరం” అని ఆమె నొక్కి చెప్పారు.
Read Also:AA22xA6: ఇట్స్ అఫిషియల్.. AA22xA6 మూవీలో దీపికా పదుకొణే ఫిక్స్
అధికారుల సస్పెన్షన్‌పై అసంతృప్తి
ఈ ఘటన తర్వాత పలువురు అధికారులను సస్పెండ్ చేయడాన్ని రమ్య తప్పుబట్టారు. “అధికారులను వెంటనే సస్పెండ్ చేసిన నిర్ణయం ఆలోచించకుండా తీసుకున్నట్లుగా ఉంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు నివేదిక కోసం వేచి ఉండాల్సింది” అని ఆమె అన్నారు. “అక్కడికి వచ్చిన అందరికీ మంచి ఉద్దేశ్యమే ఉంది. కానీ, సరైన ప్రణాళిక లోపించడం, సమన్వయం లేకపోవడం వల్లే ఇలా జరిగింది. ఆటగాళ్లను ఒకే చోట గుమిగూడకుండా, ఓపెన్ బస్సులో ర్యాలీ నిర్వహించి ఉంటే, ఈ సంఘటనను నివారించగలిగే వాళ్ళం” అని రమ్య సూచించారు.
రమ్య ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మిస్సింగ్
రమ్య ప్రస్తుతం నటనకు, రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, సామాజిక విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. ఈ తొక్కిసలాట ఘటనపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో ఒక పోస్ట్ చేశారు. అయితే, ఆ పోస్ట్ ఇప్పుడు కనిపించడం లేదు. ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లు సాధారణంగా 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి. కానీ, ఇది ఆటోమెటిక్‌గా జరిగిందా లేక రమ్యనే డిలీట్ చేశారా అనేది స్పష్టం కాలేదు.
Read Also:RGV : రాజ్ కుమార్ రీమేక్ లతోనే ఫేమస్ అయ్యారు.. కన్నడ వివాదానికి అగ్గిరాజేస్తున్న ఆర్జీవీ