Allu Arjun Next Movie: ఇట్స్ అఫిషియల్.. AA22xA6 మూవీలో దీపికా పదుకొణే ఫిక్స్

AA22xA6: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ సినిమా ‘AA22xA6’పై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరని ఫ్యాన్స్‌లో ప్రశ్నలు మొదలు అయ్యాయి. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీం ప్రకటించింది. హీరోయిన్‌కి మూవీ స్టోరీ వివరిస్తూ ఓ ట్రైల్ వేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరో మరి ఈ స్టోరీలో చూద్దాం.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించనుంది. ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు అట్లీ, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాలో దీపికా నటించారు. ఇప్పుడు మరోసారి డైరెక్టర్-హీరోయిన్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. అయితే అల్లు అర్జున్, దీపికా పదుకొణే కలిసి నటించడం ఇదే మొదటిసారి. దీపికా పదుకొణే సినిమాలో నటిస్తున్న విషయాన్ని వెల్లడిస్తూ విడుదల చేసిన వీడియోను చూస్తే, ఆమె ‘వారియర్ ప్రిన్సెస్’ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోషన్ పిక్చర్ క్యాప్చర్ టెక్నాలజీతో ఆమెకు సంబంధించిన కొన్ని షాట్స్ కూడా తీసినట్లు సమాచారం. ఈ సినిమాలో దీపికాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో త్రిపుల్ రోల్ (మూడు పాత్రలు) పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో ఒక పాత్ర తండ్రి క్యారెక్టర్ అయితే, మిగిలిన రెండు క్యారెక్టర్లు అన్నదమ్ములు అని, వారిలో ఒకరు హీరోగా, మరొకరు విలన్‌గా కనిపించనున్నారని టాక్. దీపికాతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ నటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన అయితే రాలేదు.
The Queen marches to conquer!❤🔥
Welcome onboard @deepikapadukone✨#TheFacesOfAA22xA6▶️ https://t.co/LefIldi0M5#AA22xA6 – A Magnum Opus from Sun Pictures💥@alluarjun @Atlee_dir#SunPictures #AA22 #A6 pic.twitter.com/85l7K31J8z
— Sun Pictures (@sunpictures) June 7, 2025
అల్లు అర్జున్-అట్లీ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా 800 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. దేశంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ కోసం అల్లు అర్జున్, అట్లీ ఇప్పటికే అమెరికా వెళ్లి అక్కడి ప్రముఖ విఎఫ్ఎక్స్ కంపెనీలతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అటు అల్లు అర్జున్ అభిమానులతో పాటు, సినీ ప్రియుల్లోనూ అంచనాలు పెరుగుతున్నాయి.
-
Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు
-
Allu Arjun : రణ్ వీర్ కు షాక్.. శక్తిమాన్ గా రాబోతున్న అల్లు అర్జున్ ?
-
Rashmika Mandanna : ఆయనలో అన్నీ ఇష్టమే.. విజయ్ గురించి చెబుతూ సిగ్గుపడ్డ రష్మిక
-
Allu Arjun : ఫాదర్స్ డే సర్ప్రైజ్.. పిల్లల గిఫ్ట్‌కు భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్!
-
Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. వీడియో వైరల్