OTT Movie : ఓటీటీలోకి నేడు అదిరిపోయే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
OTT Movie: కొందరు కేవలం ఒకే జోనర్‌లో ఉండే సినిమాలు చూడటానికి ఇష్టపడితే.. మరికొందరు అన్ని రకాల జోనర్‌లో ఉండే సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. ఇలాంటి వారికే ఈ ఓటీటీ మూవీస్. ఎందుకంటే ఓటీటీలో అన్ని రకాల జోనర్‌లో ఉన్న మూవీస్ ఉంటాయి. ఎవరికి ఏ మూవీస్ నచ్చితే అవి చూడవచ్చు. అయితే నేడు ఓటీటీలోకి వచ్చిన ఆ సినిమాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

OTT Movie : ప్రస్తుతం కూడా ఓటీటీ హవా నడుస్తోంది. చాలా మంది థియేటర్లలో సినిమాలు చూడటానికి కంటే.. ఓటీటీలో చూడటానికే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. దీంతో ఓటీటీలోకి ఎప్పుడప్పుడు కొత్త సినిమాలు వస్తాయని ఎదురు చూస్తుంటారు. అయితే నేడు ఓటీటీలోకి నాలుగు సినిమాలు ఒక్కసారిగా వస్తున్నాయి. అందులో రెండు సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. అయితే ఈ నాలుగు కూడా ఒకే జోనర్‌లో కాదు.. డిఫరెంట్ జోనర్‌లో ఉన్నాయి. ఒకటి డిఫరెంట్ జోనర్, హారర్ యాక్షన్, కామెడీ డ్రామాలో వస్తున్నాయి. కొందరు కేవలం ఒకే జోనర్‌లో ఉండే సినిమాలు చూడటానికి ఇష్టపడితే.. మరికొందరు అన్ని రకాల జోనర్‌లో ఉండే సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. ఇలాంటి వారికే ఈ ఓటీటీ మూవీస్. ఎందుకంటే ఓటీటీలో అన్ని రకాల జోనర్‌లో ఉన్న మూవీస్ ఉంటాయి. ఎవరికి ఏ మూవీస్ నచ్చితే అవి చూడవచ్చు. అయితే నేడు ఓటీటీలోకి వచ్చిన ఆ సినిమాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఏ రియల్ పెయిన్
గతేడాది అమెరికాలో రిలీజ్ అయిన హాలీవుడ్ కామెడీ మూవీ నేడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చేసింది. హాలీవుడ్‌లో ఇది భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో జెస్సీ ఐసన్ బర్గ్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దీనికి దర్శకత్వం కూడా వహించాడు. ఇతనితో పాటు కీరాన్ కుల్కిన్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు. 3 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 24.7 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ది బాండ్స్‌మ్యాన్
హారర్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ది బాండ్స్ మ్యాన్ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో హాలీవుడ్ పాపులర్ యాక్టర్ కెవిన్ బాకన్, మ్యాక్స్‌వెల్ జెంకిన్స్, జెన్నిఫర్ నెట్లెస్, జొలెనో పూర్డీ, బెత్ గ్రాంట్ ప్రధాన పాత్రల్లో నటించారు. హారర్ ఎలిమెంట్స్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది.
పల్స్
థ్రిల్లర్ వెబ్ సిరీస్ పల్స్ ఓటీటీలోకి వచ్చేసింది. మెడికల్ డ్రామా, రొమాంటిక్ సీన్లతో తెరకెక్కిన ఈ సిరీస్ సాయంత్రం లోపు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది సబ్ టైటిల్స్‌తో ఓటీటీలో స్టీమింగ్ కానుంది.
ఉద్వేగం
ఈ సినిమా గతేడాది తెలుగులో విడుదలైంది. కోర్టు రూమ్ డ్రామా ఉద్వేగం ది ఫస్ట్ కేస్ ఆఫ్. ఈ సినిమాలో యంగ్ హీరో త్రిగున్, దీప్సిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక సీనియర్ హీరో సురేష్, యాక్టర్ శ్రీకాంత్ ఐయ్యంగర్, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, ఐ డ్రీమ్ అంజలి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
-
Star Heroine : ఒక్క ఏడాదిలో 12 సినిమాలు రిలీజ్ చేసిన హీరోయిన్.. కానీ మరుసటి ఏడాది ఊహించని మరణం.. ఎవరంటే..
-
Aha Subscription : కేవలం రూ.67లకే ఆహా సబ్‌స్క్రిప్షన్
-
Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?
-
New Movie In OTT : ఓటీటీలోకి వచ్చేసిన న్యూ మూవీస్.. స్ట్రీమింగ్ అందులోనే?
-
Pooja Hegde : కోట్లు పెట్టి కావాలనే నన్ను ట్రోల్ చేస్తున్నారు.. బుట్టబొమ్మ ఎమోషనల్
-
Cartoon Shows: ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా ఐదు కార్టూన్ షోలు ఓటీటీలోకి.. ఎప్పటినుంచంటే?