Pooja Hegde : కోట్లు పెట్టి కావాలనే నన్ను ట్రోల్ చేస్తున్నారు.. బుట్టబొమ్మ ఎమోషనల్

Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడిప్పుడే పూజా చేతిలో కాస్త సినిమాలు ఉన్నాయి. వరుస సినిమాలు హిట్ కావడంతో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ బుట్టబొమ్మ ఆ తర్వాత చేతిలో ఆఫర్లు లేవు. మళ్లీ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్, కోలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేసింది. కావాలనే తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని కామెంట్స్ చేసింది.
చాలా మంది కావాలనే కోట్లు ఖర్చు పెట్టి మరి తనపై కావాలనే నెగిటివిటీని పెంచుతున్నారని తెలిపింది. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు జీవితంలో జరిగిన అనుభవాల గురించి చెబుతూ వెల్లడించింది. సోషల్ మీడియాలో తనకు ఎక్కువగా ట్రోలింగ్స్ వస్తున్నాని, కావాలనే చాలా మంది తనని, తన కుటుంబాన్ని ట్రోల్ చేస్తున్నారని తెలిపింది. ఒక నటిపై ఇలా ట్రోల్ చేయడం ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. ఇలాంటి ట్రోల్స్‌ను చూసి తన తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారని ఆమె ఫీల్ అయ్యారు. అసలు ఎందుకు ఎక్కువగా ట్రోల్ జరుగుతుందని కూడా తన టీమ్‌కి కనుక్కోమని తెలిపినట్లు పూజా ఇటీవల తెలిపారు. అయితే ఎక్కువగా ఖర్చు పెట్టి, మీమ్స్ పేజ్ క్రియేట్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు. వాటిని మీరు ఆపాలన్నా కూడా ఎక్కువగా ఖర్చు అవుతుందని టీం తెలిపారని, అందుకే ఇక పట్టించుకోవడం మానేశానని అన్నారు. ఇలాంటి ట్రోల్స్ ఇకపై పట్టించుకోనని కేవలం సినిమాలపైనే తన ఇంట్రెస్ట్ అంతా ఉన్నట్లు తెలిపింది. అయితే ఎవరు ట్రోల్స్ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం పూజా బయటకు చెప్పలేదు. అసలు ఎవరిని బ్లేమ్ చేస్తుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కాస్త బిజీగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత సినిమాలు చేస్తోంది. మొదట్లో మంచి అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోలతో నటించి.. స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చింది. పాన్ ఇండియా బ్యూటీగా ఎదిగి ఒక్కసారి సైలెంట్ అయ్యింది. దీంతో ఇక పూజా పని అయిపోయిందని అనుకున్నారు. కానీ మళ్లీ ఇప్పుడు సూర్య, విజయ్ వంటి వారితో సినిమాలు చేస్తోంది. జననాయగన్, రెట్రో, కాంచన 4, రజనీకాంత్ కూలి సినిమాల్లో పూజా నటిస్తోంది. మరి ఈ సినిమాలు ఆమెకు మంచి ఆఫర్లును తీసుకొస్తాయో లేదో చూడాలి.
-
Star Heroine : ఒక్క ఏడాదిలో 12 సినిమాలు రిలీజ్ చేసిన హీరోయిన్.. కానీ మరుసటి ఏడాది ఊహించని మరణం.. ఎవరంటే..
-
OTT Movie : ఓటీటీలోకి నేడు అదిరిపోయే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
-
Aha Subscription : కేవలం రూ.67లకే ఆహా సబ్స్క్రిప్షన్
-
Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?
-
New Movie In OTT : ఓటీటీలోకి వచ్చేసిన న్యూ మూవీస్.. స్ట్రీమింగ్ అందులోనే?
-
Pooja Hegde: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన బుట్ట బొమ్మ.. ఏకంగా సూపర్ స్టార్‌తో నటించే అవకాశం