Pushpa 2 Collections: పుష్ప 2 ఫైనల్ కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయో మీకు తెలుసా?

Pushpa 2 Collections:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా గతేడాది రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. థియేటర్‌లో రికార్డులు సృష్టించిన పుష్ప 2 ఇప్పడు నెట్‍ఫ్లిక్స్‌లో కూడా రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపించి.. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పుష్ప 2 విడుదలకు ముందు క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్‌కు తగ్గట్లుగానే రిలీజ్ తర్వాత కూడా సత్తాచాటింది. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టే విధంగా కలెక్షన్లు రాబట్టింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సీక్వెల్ మూవీ. వీరిద్దరి కాంబోలో రావడంతో సినిమా మంచి హిట్ సాధించింది.
సినిమా విడుదల అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కలెక్షన్లు సునామీ సృష్టించింది. అయితే మూవీ టీం తాజాగా ఫైనల్ కలెక్షన్లను ప్రకటించింది. ఈ చిత్రం మొత్తం రూ.1871 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు మూవీ టీం తెలిపింది. ఈ విషయాన్ని నేడు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పుష్ప 2 మూవీ చాలా రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు కొత్త కొత్త రికార్డులను కూడా సృష్టించిందని, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్‍గా కూడా నిలిచిందని, రికార్డ్స్ రప్పారప్పా అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ.. అల్లు అర్జున్, సుకుమార్ ఫొటోను కూడా ఇందులో పెట్టారు. టాలీవుడ్‌లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 రికార్డు సృష్టించింది.
ఇదిలా ఉండగా పుష్ప 2 కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. దంగల్ సినిమా రూ.2,2024 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా పుష్ప 2 రెండో స్థానంలో ఉంది. అయితే ఈ సినిమా బాహుబలి 2 కలెక్షన్లను కూడా దాటేసింది. అయితే ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా కూడా పుష్ప 2 రికార్డు సృష్టించింది. ఈ సినిమా కలెక్షన్ల ఫేక్ అని చాలా మంది కామెంట్లు చేశారు.
మరికొందరు టికెట్ రేటు ఎక్కువగా పెట్టడం వల్ల కలెక్షన్లు రావా అని కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ఐటీ రైడ్స్ జరిగాయి. ఇందులో పుష్ప 2 విషయంలో తక్కువ ట్యాక్స్ కట్టారని, ఫేక్ కలెక్షన్లు అని అన్నారు. వీటిన్నింటికి చెక్ పెడుతూ మూవీ టీం ఫైనల్ కలెక్షన్ల పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా కనిపించింది. ఫాహద్ ఫాజిల్ నెగెటివ్ రోల్‌లో కుమ్మేశాడు. అయితే ఈ సినిమాలో వీరితో పాటు జగపతి బాబు, రావు రమేశ్, సునీల్, జగదీశ్, అనసూయ, అజయ్, తారక్ పొన్నప్ప ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
-
Priyanka Chopra: అట్లీ, అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక?
-
Lola VFX : లోలా VFX స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా?
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా