Sreeleela: ఎంగేజ్మెంట్‌పై సంచలన ప్రకటన చేసిన శ్రీ లీల

Sreeleela: హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈమె వరుస సినిమాలో ప్రేక్షకులను అలరిస్తోంది. చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వాళ్ల వరకు అసలు శ్రీలీల అంటే తెలియని వారు ఎవరూ లేరు. అయితే సోషల్ మీడియాలో కూడా ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తు్ంటుంది. అయితే శ్రీలీల ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పొటోలను షేర్ చేసింది. అందులో సంప్రదాయం ప్రకారం రెడీ కావడంతో పాటు ఆ ఫొటోలకు ‘బిగ్ డే’, ‘కమింగ్ సూన్’ అనే క్యాప్షన్ పెట్టారు. దీంతో శ్రీలీల సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుందని జోరుగా ప్రచారం సాగింది. మరికొందరు ఏదైనా మూవీ యాడ్ అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ క్రమంలో శ్రీలీల వీటిపై స్పందించింది. ఎంగేజ్‌మెంట్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఇంట్లో ఎలాంటి వేడుక అయినా కూడా సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారని తెలిపింది. అయితే వచ్చే నెలలో తన పుట్టిన రోజు వస్తుందని, ముందుగానే ఇంట్లో వేడుక నిర్వహించినట్లు శ్రీలీల తెలిపింది.
బాలనటిగా తొలుత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నాలుగేళ్ల తర్వాత హీరోయిన్‌గా శ్రీ లీల ఎంట్రీ ఇచ్చారు. పెళ్లిసందడితో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో ధమాకాలో నటించింది. ఆ తర్వాత వరుసగా స్కంధ, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డినరీ మేన్, గుంటూరు కారం, భగవంత్ కేసరిలో నటించింది. అలాగే పుష్ప 2లోని కిస్సిక్ సాంగ్‌లో కూడా నటించి పాన్ ఇండియాలో లెవెల్‌లో గుర్తింపు సంపాదించుకుంది. అయితే శ్రీలీలకు వరుస ఫ్లాప్‌లు వస్తున్నా కూడా ఏ మాత్రం రేంజ్ తగ్గడం లేదు. ఏకంగా బాలీవుడ్‌లో పాగా వేసే స్థాయికి ఆమె ఎదిగింది. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ఆషికి 3 ద్వారా హిందీలో అడుగు పెడుతోంది శ్రీలీల. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ సరసన ఆమె నటిస్తున్నారు. భరత్ భూషణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. అయితే అషికి 3 ఇంకా సెట్స్ మీద ఉండగానే శ్రీలీల హిందీలో మరో ఆఫర్ అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సిద్ధార్ధ్ మల్హోత్రా సరసన శ్రీలీల ఆడిపడనుందట. ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. రాజ్ సాండియాలా దర్శకత్వం వహిస్తారని బీటౌన్ మీడియా చెబుతోంది. ఇవి కాకుండా తెలుగులో జూనియర్, మాస్ జాతర, లెనిన్, తమిళంలో పరాశక్తి సినిమాలలో శ్రీలీల నటిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Kamal Hasan : కన్నడ భాషపై కమల్ హాసన్ వ్యాఖ్యలు.. థగ్ లైఫ్ సినిమా విడుదలయ్యేనా ?
-
Zodiac Signs: శని ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
-
Rinku Singh: ఎంపీ రింకూ సింగ్ నిశ్చితార్థం.. పెళ్లి డేట్ కూడా ఫిక్స్
-
Lawcet: లాసెట్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు రిలీజ్
-
Astrology: గురు సంచార ప్రభావం.. ఈ రాశులకు డబ్బే డబ్బు
-
Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో కావాల్సిన విటమిన్.. తక్కువైతే ప్రాణాలకే ప్రమాదం
-
Miss World: మిస్ వరల్డ్ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా?