Tollywood Heroine : నాలుగు సినిమాలు చేస్తే ఒక్కటే హిట్.. అవకాశాలు రావడం లేదంటూ స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్.. ఎవరంటే

Tollywood Heroine :
ప్రతి నటీనటులకు సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేది సహజం. హిట్స్, ఫ్లాప్స్ లతో సంబంధం లేకుండా హీరోలు వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంటారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.
ఒక సినిమా ఆశించిన స్థాయిలో రాణించకపోతే మాత్రం ఆ హీరోయిన్ కు మరియు దర్శకుడికి కెరియర్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ హీరోయిన్ కు అవకాశాలు రావడం కష్టమే. ఈ హీరోయిన్ కూడా ఫ్లాప్స్ అందుకోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. చాలామంది ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించి బాగా ఫేమస్ అవ్వాలి అలాగే స్టార్ హీరోల సినిమాలలో నటించాలి అని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. కానీ కొంతమందికి మాత్రమే అదృష్టం కలిసి వచ్చి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చి స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతారు. మరి కొంతమంది మాత్రం అదృష్టం కలిసి రాక అవకాశాలు రాక కనుమరుగైపోతున్నారు. అందం, అభినయం ఉన్నా కూడా చాలామంది ముద్దుగుమ్మలు అవకాశాలు రాక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కొంతమంది హీరోయిన్లు సినిమాలు మానేసి బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే మరి కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక యంగ్ హీరోయిన్ అదృష్టం కలిసి రాక అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. తనకు అవకాశాలు కూడా కల్పించాలని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈమె తెలుగులో చేసింది కేవలం నాలుగు సినిమాలే. మొదటి సినిమాతోనే ఈమె తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుసగా సినిమాలు చేసింది. కానీ ఇప్పటివరకు ఈమె చేసిన సినిమాలలో కేవలం మొదటి సినిమా మాత్రమే విజయం సాధించింది. మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దాంతో ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైంది.
ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆది సాయికుమార్ హీరోగా నటించిన లవ్లీ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది. బి ఏ జయ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ విజయం సాధించింది. ఈ సినిమాలో ఆదికు జంటగా నటించిన హీరోయిన్ శాన్వి శ్రీ వాస్తవ. తన క్యూట్ పర్ఫామెన్స్ తో మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కవ్వించింది. ఈ సినిమా హిట్ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. సుశాంత్ కు జోడిగా అడ్డా సినిమాలో, మంచు విష్ణుకు జోడిగా రౌడీ అలాగే మరోసారి ఆదికు జోడుగా ప్యార్ మే పడిపోయానే సినిమాలలో నటించింది.
కానీ ఆ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందాయి. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీకి వెళ్లిన శాన్వి అక్కడ పర్వాలేదనిపించుకుంది. అతడే శ్రీమన్నారాయణ అనే డబ్బింగ్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా సమయంలో మాట్లాడిన శాన్వి తెలుగులో సినిమా అవకాశాలు రావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యింది. తనకు ఎందుకు అవకాశాలు రావడం లేదో అంటూ స్టేజ్ పైన కన్నీళ్లు పెట్టుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తుంది. ఇక అక్కడ కూడా ఆమెకు చెప్పుకోదగ్గ సినిమాలు అయితే రావడం లేదు.
View this post on Instagram
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Tollywood Heroine: డాక్టర్ గా చేస్తూనే హీరోయిన్ గా కూడా ఫుల్ క్రేజ్.. ఫోటోలో బొద్దుగా ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే..
-
Akkineni Nagarjuna : నాగార్జున కి తల్లిగా..నాగ చైతన్య కి లవర్ గా నటించిన ఏకైక హీరోయిన్!
-
Tollywood Heroine : రెండు జడలు వేసుకుని సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్న ఈ చిన్నారి టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్…ఎవరో గుర్తుపట్టారా..
-
Tollywood Heroine : అమ్మ చేతి గోరుముద్దలు తింటున్న ఏ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా…
-
Tollywood Heroine : తెలుగులో ఒక్క సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది.. డాక్టర్ గా చేస్తూనే సినిమాల్లో హీరోయిన్ గా.. ఎవరో గుర్తుపట్టారా…