Tollywood Heroine : తెలుగులో ఒక్క సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది.. డాక్టర్ గా చేస్తూనే సినిమాల్లో హీరోయిన్ గా.. ఎవరో గుర్తుపట్టారా…

Tollywood Heroine :
సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత అవకాశాలు రావడం చాలా కష్టం. ఎంతో కష్టపడి అవకాశాలు తెచ్చుకున్నప్పటికీ విజయం సాధించడం కూడా అంత సులభమైన పని కాదు. అయితే చాలామంది తమ కళలను నెరవేర్చుకోవడానికి హీరోయిన్ గా స్టార్ డం సంపాదించుకోవడానికి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. ఇలా అడుగుపెట్టిన చాలామంది ముద్దుగుమ్మలు మొదటి సినిమాతోనే తమ నటనతో, అందంతో ప్రేక్షకులను కవ్వించి అందరి దృష్టిని తమ వైపు తిప్పుకుంటారు. ఈ క్రమంలో వాళ్లు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ విజయం కూడా సాధిస్తారు. మొదటి సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ వాళ్లు ఆ తర్వాత మాత్రం అనుకున్న స్థాయిలో అవకాశాలను అందుకోలేక పోతున్నారు.ఇలా టాలీవుడ్ లో కేవలం ఒకే ఒక సినిమాతో ఫేమస్ అయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. తమ అందంతో, అభినయంతో వాళ్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఈ జాబితాకు చెందిందే. ఆమె తెలుగులో చేసింది కేవలం ఒకే ఒక సినిమా. ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. మరోవైపు ఈ హీరోయిన్ డాక్టర్ గా తన విధులను నిర్వహిస్తుంది. కానీ ఈమెకు టాలీవుడ్ లో అనుకున్నంత క్రేజ్ రాలేదు. దాంతో ఈమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు కూడా రాలేదు. ప్రస్తుతం ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టగలరా. ఈమె తెలుగులో నటించిన సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. కానీ ఈ అమ్మడుకు మాత్రం అనుకున్నంత క్రేజ్ రాలేదు. ఆఫర్స్ కూడా అందుకోలేకపోయింది.
ప్రస్తుతం ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ రూప కొడువాయుర్. టాలీవుడ్ హీరో సత్యదేవ్ కు జోడిగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది రూప. అయితే ఈ సినిమాలో నటిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ కూడా అంతగా గుర్తింపును మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత రూప బిగ్ బాస్ సోహెల్ నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో రూపాకు బాగా పాపులారిటీ వచ్చింది. కానీ అనుకున్నంత అవకాశాలు అయితే అందుకోలేదు. తమిళం నుంచి బ్యూటీ కి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. రూప కేవలం నటి మాత్రమే కాదు డాక్టర్ కూడా.
అలాగే ఈమె మంచి డాన్సర్ కూడా. ఒకవైపు డాక్టర్ గా తన వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు హీరోయిన్ గా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది రూప. తాజాగా రూపా షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ లుక్స్ తో చేతిలో కాఫీ కప్పుతో ఫోటోలకు ఫోజులిచ్చింది రూప. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో రూపా షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో అందరిని ఆకట్టుకుంటున్నాయి.
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Tollywood Heroine: డాక్టర్ గా చేస్తూనే హీరోయిన్ గా కూడా ఫుల్ క్రేజ్.. ఫోటోలో బొద్దుగా ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే..
-
Akkineni Nagarjuna : నాగార్జున కి తల్లిగా..నాగ చైతన్య కి లవర్ గా నటించిన ఏకైక హీరోయిన్!
-
Tollywood Heroine : రెండు జడలు వేసుకుని సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్న ఈ చిన్నారి టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్…ఎవరో గుర్తుపట్టారా..
-
Tollywood Heroine : అమ్మ చేతి గోరుముద్దలు తింటున్న ఏ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా…
-
Tollywood Heroine : నాలుగు సినిమాలు చేస్తే ఒక్కటే హిట్.. అవకాశాలు రావడం లేదంటూ స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్.. ఎవరంటే