Pakistan Super League : పాకిస్థాన్ సూపర్ లీగ్ షెడ్యూల్ రిలీజ్.. మళ్లీ నష్టాల బాట పడటం తప్పదా?

Pakistan Super League :
ప్రపంచంలో అత్యంత ఖరీదైన లీగ్ ఐపీఎల్. ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ టీవీలు అంటిపెట్టుకుని ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా ఈ మ్యా్చ్‌లను వీక్షిస్తుంటారు. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ అయిన వెంటనే ఈ లీగ్ స్టార్ట్ చేస్తారు. అయితే ఈ ఐపీఎల్ సమయంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 18 వరకు ఈ లీగ్ జరగనున్నట్లు పీసీబీ ప్రకటించింది. ఈ పాకిస్థాన్ సూపర్ లీగ్ షెడ్యూల్‌లో కేవలం ఆరు జట్లు మాత్రమే పాల్గొంటాయి. అయితే ఈ లీగ్‌లో ఆడే విదేశీ క్రికెటర్ల సంఖ్య కూడా చాలా తక్కువ. అన్ని విధాలుగా ఇది ఐపీఎల్‌తో పోలిస్తే చాలా తక్కువ. అలాంటిది ఐపీఎల్‌తో పోటీకి దిగుతుంది. ఐపీఎల్ సమయంలో ఈ లీగ్ నిర్వహించడం వల్ల పీఎస్‌ఎల్‌కే నష్టం. కానీ ఈ విషయాన్ని పీసీబీ గుర్తించడం లేదు. ఏప్రిల్ 11వ తేదీన పీఎస్‌ఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్, లాహోర్ ఖలందర్స్ తలపడనున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ మే 18వ తేదీన జరగనుంది. రెండు ఎలిమినేటర్లు, ఫైనల్‌తో పాటు మొత్తం 13 మ్యాచ్‌లకు గడాఫీ స్డేడియంలో జరగనున్నాయి. ఈ పీసీఎల్ మొత్తం 34 మ్యాచ్‌లు మాత్రమే. వచ్చే ఎడిషన్‌లో ఈ మ్యాచ్‌లో తలపడే జట్లు వివరాలను త్వరలోనే ప్రకటిస్తాయి. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఖరీదైన ఐపీఎల్ లీగ్ వచ్చే నెల ప్రారంభమై మే 25న ఫైనల్ జరుగుతుంది. ఇందులో మొత్తం 10 జట్లు తలపడతాయి. 74 మ్యాచ్‌లు మొత్తం జరగనుండగా.. 13 స్టేడియాల్లో జరుగుతాయి. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో ఆర్సీబీ పోటీపడనుంది.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 19వ తేదీన పాకిస్థాన్ వేదికగా ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ నిష్క్రమించింది. పాకిస్థాన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం భారీగానే ఖర్చు పెట్టింది. కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియం పునరుద్ధరణకు దాదాపుగా 12.3 బిలియన్ పాకిస్తాన్ రూపాయలు అవుతుందని అంచనా వేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ.383 కోట్లు అన్నమాట. అయితే ఈ ఖర్చులు ఇక్కడితే ఆగకుండా పెరిగాయి. ఇప్పుడు ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ ఏకంగా రూ.591 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కానీ పాకిస్థాన్ సెమీస్‌కు వెళ్లకుండా వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. దీంతో పాకిస్థాన్ జట్టుకు కేవలం రూ.2.3 కోట్లు మాత్రమే ఐసీసీ ఇవ్వనుంది. దీనిపై నెటిజన్లు పాకిస్థాన్ జట్టును ఎక్కువగా ట్రోల్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ టైమ్‌లనే ఇలా పీసీఎల్‌ను నిర్వహించడంతో మళ్లీ పాకిస్థాన్‌కు నష్టం తప్పదని పలువురు అంటున్నారు.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
Shreyas Iyer: రూ.23 కోట్లకు న్యాయం చేసిన అయ్యర్.. ఒక్క మ్యాచ్‌తో నోళ్లు మూయించేశాడుగా!
-
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. బుమ్రా ఎంట్రీ కష్టమే
-
IPL 2025: సన్ రైజర్స్ కు ఆడలేదు.. లక్నోకు దంచికొడుతుండు..ఇదేందయ్యా ఇదీ