Turkey: మాల్దీవులకు అర్థమైంది.. తుర్కియోకు అర్థమవుతోంది..భారత్ తో గెలుక్కుంటే అంతే సంగతులు!
Turkey భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్.. కాకలు తీరిన అమెరికా కూడా మన దగ్గర తన ఉత్పత్తులను అమ్ముకొని బతకాల్సిందే. అక్కడిదాకా ఎందుకు అంతటి చైనా కూడా మన ముందు సైలెంట్ అవ్వాల్సిందే.

Turkey: ఆ మధ్య గాల్వన్ లోయ ఘటన జరిగినప్పుడు భారత్ చైనా మీద ట్రేడ్ వార్ కొనసాగించింది. చైనా దేశానికి చెందిన సోషల్ మీడియా యాప్స్ పై భారీ దెబ్బ వేసింది. దీంతో చైనా సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. అంతేకాదు మధ్య మార్గాల ద్వారా మన దేశ పాలకులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక అమెరికాపై కూడా ప్రతిగా సుంకాలు విధించడానికి మనం రెడీ అవుతున్నామంటే.. ఆర్థికంగా, రాజకీయంగా మన ప్రస్థానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అలాంటి మనపై అవాకులు చవాకులు పేలితే.. అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో.. ఇప్పుడు కొన్ని దేశాలకు తెలిసి వస్తోంది. ఈ పరిణామం ప్రపంచ దేశాల ముందు భారత్ స్థాయి ఏమిటో నిరూపిస్తోంది…
సరిగ్గా ఏడాది క్రితం..
సరిగ్గా ఏడాది క్రితం మనపై మాల్దీవులు తీవ్ర అక్కసు ప్రదర్శించింది. మన దేశంలో ఉన్న సముద్ర దీవుల ప్రాంతాన్ని పర్యాటకంగా ఎంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సూచిస్తే.. మాల్దీవుల ప్రభుత్వం దానిని వ్యతిరేకంగా తీసుకుంది. భారతదేశంపై తీవ్రమైన విమర్శలు చేసింది. అంతేకాదు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసింది. చివరికి సారి చెప్పాల్సి వచ్చింది. అయితే భారత్ మీద చేసిన విమర్శల నేపథ్యంలో మన దేశానికి చెందిన పర్యాటకులు మాల్దీవులు వెళ్లడం మానేశారు. మాల్దీవులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక ఉద్యమమే చేశారు. దీంతో టూరిజం నుంచి ఆదాయం లేకుండా పోవడంతో మాల్దీవులు దివాలా తీసింది. చైనాను నమ్ముకుంటే.. చైనా కూడా ఆదేశాన్ని నట్టేట ముంచింది. దీంతో ఇప్పుడు మాల్దీవుల ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షేభంలో కూరుకుపోయింది. ఇప్పటికిప్పుడు భారతదేశాన్ని ప్రసన్నం చేసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చైనా తో అంట కాగినందుకు భారత్ మాల్దీవులకు చేయూత అందించే పరిస్థితి లేకుండా పోయింది.
తుర్కియో కూడా..
ఒక అనుభవం నుంచి పాఠం నేర్చుకోవాలి. దానిని అమలులో పెట్టి.. బాగుపడే ప్రణాళికలు రూపొందించుకోవాలి.. కానీ ఈ ఇంగితం తుర్కియో దేశానికి లేకుండా పోయింది. భారత్ ఎంత శక్తివంతమైనదో తెలిసినప్పటికీ కూడా.. అనవసరంగా ఉగ్రవాద దేశానికి సహాయం చేసింది. దీంతో అది మన దేశ పరిపాలకులకు ఒళ్ళు మండేలా చేసింది. ఫలితంగా తుర్కియో పై భారత్ ట్రేడ్ వార్ మొదలుపెట్టింది. ఆ దేశం నుంచి వస్తున్న ఆపిల్స్ ను దిగుమతి చేసుకోవద్దని మన దేశానికి చెందిన వ్యాపారులు నిర్ణయించారు. దీంతో 1500 కోట్ల విలువైన ఆపిల్స్ ఆగిపోయాయి. అంతేకాదు తుర్కియో లో పర్యటించకూడదని మనదేశ పర్యాటకులు నిర్ణయించుకున్నారు. అటు పర్యాటకపరంగా.. ఇటు వ్యాపారపరంగా తుర్కియో తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటోంది. మన శత్రువుకు సపోర్ట్ చేసినందుకు.. మన దేశ పరిపాలకులు.. ప్రజలు తుర్కియో పై వాణిజ్య దండయాత్ర చేస్తున్నారు. దీంతో తుర్కియో పాలకులు తలలు పట్టుకున్నారు. అనవసరంగా ఉగ్రవాద దేశానికి సహాయం చేసి నష్టపోతున్నామని గుండెలు బాదుకుంటున్నారు.
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Ind Vs Pak WCL: పాకిస్థాన్ తో సెమీస్ ఆడం.. షాకిచ్చిన ఇండియా
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Masood Azhar: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మసూద్