Alzheimer’s: భయపెట్టిస్తున్న అల్జీమర్స్.. మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ.. కారణమేంటి?

Alzheimer’s:
వయస్సు పెరిగే కొలది మతిమరుపు రావడమనేది సహజం. ఈ అల్జీమర్స్ సమస్య ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుంది. అందులోనూ మహిళల్లోనే ఎక్కువగా వస్తుందని అంటుంటారు. కానీ ఈ అల్జీమర్స్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది పురుషుల్లో ఈ అల్జీమర్స్ సమస్య ఉందని అంటున్నారు. బాల్టిమోర్ లాంగ్జిట్యూడినల్ స్టడీ ఆఫ్ ఏజింగ్ వృద్ధుల మొదళ్లను స్కాన్ చేసింది. దీంతో అల్జీమర్స్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది పురుషులు ఉన్నట్లు గుర్తించింది. దీంతో వీరు ఏ విషయంలో కూడా వారి సొంత నిర్ణయాలు తీసుకోలేరు. ఎందుకంటే మెదడులో టౌ ప్రోటీన్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. దీంతో మెదడు కణాలకు బాగా నష్టం కలుగుతుంది. దీంతో ఆల్జీమర్స్ సమస్య ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఈ అల్జీమర్స్ బారిన పడి మళ్లీ డెమెన్షియాకు పురుషులు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ సమస్య బారిన మహిళల కంటే పురుషులే ఎక్కువగా పడుతున్నారు. ఈ సమస్య బారిన పడితే అన్ని విషయాలను కూడా మర్చిపోతారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి వల్ల ఈ అల్జీమర్స్ సమస్య బారిన ఎక్కువగా పడుతున్నారు. పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం, పూర్తిగా వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ అల్జీమర్స్ సమస్య బారిన ఎక్కువగా పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను గుర్తించాలంటే స్కానింగ్‌లు చేసుకోవాలి. మొదటి స్టేజ్‌లోనే దీనిని గుర్తిస్తే సమస్యను కొంత వరకు తగ్గించవచ్చు.
అల్జీమర్స్ సమస్య నుంచి విముక్తి పొందాలంటే మానసికంగా, శారీరకంగా యాక్టివ్‌గా ఉండాలి. ఈ సమస్య ఒక వేళ తీవ్రం అయితే గుండె ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. కాబట్టి అల్జీమర్స్ రాకుండా చిట్కాలు పాటించండి. పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోండి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే వాటిని మాత్రమే తినాలి. అలాగే ఖాళీగా ఉండకుండా కొత్త విషయాలు ఎప్పటికప్పుడూ నేర్చుకోవాలి. కొత్త విషయాలు, స్కిల్స్ వంటివి నేర్చుకుంటే మీ బ్రెయిన్ బాగా మెరుగుపడుతుంది. అలాగే పజిల్స్, చెస్ ఆడటం వంటివి చేస్తే మతిమరుపు తగ్గుతుంది. మీ బ్రెయిన్ పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా బ్రెయిన్ ఛాలెంజింగ్ గేమ్స్ ఆడటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ప్రతీ మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యం. సరిగ్గా నిద్రపోవడం వల్ల మైండ్ పవర్ కూడా పెరుగుతుంది. బాడీకి సరిపడా నిద్ర లేకపోతే మాత్రం మీరు మతిమరుపు పెరుగుతుంది. అలాగే ప్రొటీన్స్ అవి పుష్కలంగా ఉన్న ఫుడ్‌ను తీసుకోవడం వల్ల మైండ్ పనితీరు మెరుగుపడుతుంది. లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఒకే జోనర్‌లో ఆలోచిస్తారు. కొత్త కొత్త ఆలోచనలు రావాలంటే మాత్రం తప్పకుండా పోషకాలు ఉండే ఫుడ్‌ను తీసుకోండి. యోగా అనేది మీకు ఆరోగ్య పరంగా కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. డైలీ ఒక అరగంట పాటు అయినా కూడా యోగా చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.