Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Curd And Fruits Mixing Eating Is Good For Health

Curd: పెరుగులో పండ్లు కలిపి తింటే.. వామ్మో ఆరోగ్యానికి ఇంత ప్రమాదమా!

Curd: పెరుగులో పండ్లు కలిపి తింటే.. వామ్మో ఆరోగ్యానికి ఇంత ప్రమాదమా!
  • Edited By: kusuma,
  • Updated on June 12, 2025 / 03:03 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Curd: ఆరోగ్యం కోసం మనం చేసే చిన్నచిన్న మార్పులు ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి. అయితే పెరుగు, పండ్లు రెండూ ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందుకే చాలా మంది వీటిని కలిపి తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా అల్పాహారంగా లేదా సాయంత్రం పూట స్నాక్‌గా వీటిని కలిపి తింటుంటారు. అయితే పెరుగుతో పండ్లను కలిపి తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పెరుగు తింటే ఆరోగ్యానికి మంచివే. ఇందులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే పెరుగులో పండ్లు కలిపి తినడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

జీర్ణ సమస్యలు
పండ్లు తిన్న వెంటనే త్వరగా జీర్ణం అవుతాయి. కానీ పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండు ఆహార పదార్థాలు వేర్వేరు సమయాల్లో జీర్ణమవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా యాసిడ్ ఉండే పండ్లతో కలిపినప్పుడు జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. దీనివల్ల ఎక్కువగా జీర్ణ సమస్యలు బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

అసిడిటీ
పుల్లని పండ్లైన నారింజ, నిమ్మ, స్ట్రాబెర్రీ వంటివి పెరుగుతో కలిపినప్పుడు కడుపులో ఆమ్లత్వం పెరుగుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెరుగులో వీటిని కలిపి తినకూడదని నిపుణులు అంటున్నారు.

చర్మ సమస్యలు
కొంతమందికి ఈ కలయిక వల్ల చర్మంపై దద్దుర్లు, దురద లేదా ఇతర అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు. ఇది శరీరంలో కొన్ని రసాయన ప్రతిచర్యలకు దారితీస్తుంది. వీటిని కలిపి తినడం వల్ల శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయని నిపుణులు అంటున్నారు.

కఫం
పెరుగుకి చలువ చేసే గుణం ఉంది. ఇందులో రకరకాల గుణాలతో ఉన్న పండ్లు వేసి తింటే శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలు అసమతుల్యతకు లోనై, దీర్ఘకాలిక సమస్యల బారిన పడతారు. చాలా మంది పెరుగులో అరటిపండు, పెరుగు కలిపి తింటారు. వీటివల్ల కఫం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే జలుబు, సైనస్ సమస్యలు ఉన్నవారు పెరుగు, పండ్ల కలయికను తినడం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది గొంతులో కఫాన్ని పెంచి, ఇబ్బందులను తెచ్చిపెడుతుందని నిపుణులు అంటున్నారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

Tag

  • curd
  • Fruits mixing
  • Health Benefits
Related News
  • BTB Juice: ఏబీసీ కాదు.. ఈ జ్యూస్ తాగితే సర్వ రోగాలు పరార్

  • Jamun Vinegar: ఈ వెనిగర్‌తో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు.. ఒక్కసారి తింటే చాలు

  • Skin Care : నగ్న స్నానం మంచిదేనా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసా ?

  • Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో కావాల్సిన విటమిన్.. తక్కువైతే ప్రాణాలకే ప్రమాదం

  • Face Pack: ఇంట్లోనే కాఫీ పౌడర్‌తో ఫేస్ ప్యాక్.. క్షణాల్లో అందం మీ సొంతం

  • Tulsi Benefits : జుట్టు రాలడం తగ్గి..నిగనిగలాడే జుట్టు కావాలంటే తులసితో ఈ టిప్స్ పాటించండి

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us