Tea: టీ వడపోసిన తర్వాత టీ ఆకులను పడేస్తున్నారా? ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో ఇప్పుడైనా తెలుసుకోండి.

Tea: ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉపయోగించేది ఏది అంటే ఏం చెబుతారు. మందు కదా? కాదు. మరేంటి? థింక్ వన్స్. ఇంకా గుర్తు రాలేదా? అయితే మీరు టీ లవర్స్ కాదు కదా. మందు, ఫుడ్ కంటే కూడా చాలా మందికి టీ అంటేనే ఎక్కువ ఇష్టం. ఉదయం లేవగానే ఒక స్విప్ వేస్తే చాలబ్బా ఆహా.. అనిపిస్తుంది. అంతేగా మరి. జస్ట్ ఆ ఒక్క స్విప్ మానేస్తే చాలా మందికి హెడ్ ఎక్ కూడా వస్తుంది. వింటర్, సమ్మర్, రైనీ సీజన్ ఇలా సీజన్ ఏదైనా సరే టీ మాత్రం కావాల్సిందే. కాస్త సమ్మర్ లో దీని వినియోగం తక్కువ కావచ్చు కానీ పూర్తిగా అసలు మానేయరు. ఇదంతా బాగానే ఉంది. అసలు మన ఇండియాలో ఉన్న ఎంతో మంది టీ తాగుతారు. టీ ఫిల్టర్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆ టీ ఆకులను పడేస్తుంటారు కదా. కానీ ఇక నుంచి ఆపేయండి. పడేయవద్దు. ఎందుకంటే?
మిగిలిపోయిన టీ ఆకులను ఏం చేయాలో తెలియక చాలామంది డస్ట్ బిన్ లో పడేస్తుంటారు. సో మనం ఇవాళ ఈ వేస్టేజ్ తో ఏం చేయాలో చూసేద్దాం. ఇక ఇందులో టానిక్ ఆమ్లం ఉంటుంది. పోషకాలు కూడా ఎక్కువేనట. నేలను సారవంతం చేయడానికి సహజ ఎరువుగా పని చేస్తాయి ఈ టీ ఆకులు. అయితే తేయాకు ఆకులు మట్టిలోకి వెళ్లి కుళ్లి పోయి మట్టిలోనే కరిగిపోతాయి. అలా ఇవి వాటి పోషకాలను నేలలోకి విడుదల చేస్తాయి అంటున్నారు నిపుణులు.
ఇలా చేయడం వల్ల నేల సారవంతం అవుతుంది. ఆ మట్టిలో ఉన్న మొక్కలకు మంచి పోషణ అందుతుంది. అవి పచ్చగా ఏపుగా వస్తుంటాయి కూడా. ఇలా మిగిలిన టీ ఆకులను ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకొని అందులో వేయాలి. బాగా కలిపి ఆ నీటిని మొక్కల మీద పిచికారీ వేస్తే సరిపోతుంది. దీని వల్ల మొక్కలను శిలీంద్ర వ్యాధుల నుంచి కాపాడవచ్చు అంటున్నారు నిపుణులు.
చాలా మంది రిఫ్రిజిరేటర్ నుంచి దుర్వాసన వస్తుందని బాధ పడుతుంటారు. ఏం చేయాలో కూడా చాలా మందికి తెలియదు. అయితే ఈ టీ ఆకులతో మీరు ఆ స్మెల్ ను కూడా పోగొట్టవచ్చట. మిగిలిన టీ ఆకులను కాటన్ వస్త్రంలో చుట్టాలి. దాన్ని మీ ఫ్రిజ్ లో పెట్టుకోండి. అయితే దీని వల్ల వెల్లుల్లి, ఉల్లిపాయల వాసన వస్తే అది కూడా పోయే అవకాశం ఉంటుంది.
ఈ మిగిలిపోయిన టీ ఆకులు చర్మానికి కూడా మంచి ఔషధంలా పని చేస్తాయి. స్కిన్ ఎక్స్ ఫోలియేటింగ్ స్క్రబ్ లో కూడా దీన్ని వినియోగించవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే దీన్ని మీ ఫేస్ వాష్ తో కలిపి చర్మం మీద రాసుకోవాలి. వడదెబ్బ, స్కిన్ కాలిపోవడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. కాలిన గాయాలపై కూడా దీన్ని పెట్టవచ్చు. దీని వల్ల మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. అయితే మిగిలిన టీ ఆకులను రుబ్బి దానికి కాస్త తేనె, పెరుగు లేదా నిమ్మరసం కలిపి ఫేస్ కు మాస్క్ వేసుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.