Weight loss : ఎంత ప్రయత్నించినా సరే బరువు తగ్గడం లేదా? జస్ట్ ఈ టీలు చాలు..

Weight loss :
ఫుల్ బరువు ఉన్నారా? కొవ్వు ఎక్కువగా ఉందా? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారా? అయినా సరే జీరో ఫలితాలా? ఫుల్ డైట్, అన్ని పాటిస్తున్నాము. బట్ ఎందుకు ఇంకా బరువు తగ్గడం లేదు అని థింక్ చేస్తున్నారా? అసలు టెన్షన్ తీసుకోవద్దు. జస్ట్ కొన్ని టీలను తీసుకోండి. అవి మీ కొవ్వును కాలుస్తాయి. ఆరోగ్యకరమైన జీవక్రియను పెంచుతాయి. మీరు చదివింది నిజమే జస్ట్ టీలు శరీరం నుంచి అదనపు కొవ్వును సహజంగా తగ్గిస్తాయి. మరి ఈ టీలలో ఏంటి ప్రత్యేకత అనుకుంటున్నారా? ఇలాంటివి చాలా తేదుగా ఉంటాయి అనుకుంటున్నారా? అసలు కాదు ఫుల్ రుచి కూడా. మరి వచ్చేయండి. ఆరోగ్యకరమైన బరువును తగ్గించే ఆ టీలో ఏంటో చూసేద్దాం..
గ్రీన్ టీ
గ్రీన్ టీలో ఉండే కాటెచిన్లు, యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను వేగవంతం చేస్తాయి. తద్వారా కొవ్వును వేగంగా బర్న్ చేస్తాయి. ఇది శరీరంలో కొవ్వు ఆక్సీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీని వలన శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది.ఇక ఈ గ్రీన్ టీలో తేలికపాటి కెఫిన్ ఉంటుంది. ఇది శక్తిని పెంచడానికి, వ్యాయామ పనితీరును మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. రోజూ ఖాళీ కడుపుతో ఒక కప్పు గ్రీన్ టీ తాగండి సరిపోతుంది. దీనికి కాస్త నిమ్మకాయ లేదా తేనె కలిపి తీసుకున్నా మంచిదే..
నిమ్మకాయ-అల్లం టీ
అల్లంలో ఉండే జింజెరాల్ అనే సమ్మేళనం శరీర వేడిని పెంచుతుంది. ఇది కొవ్వును బర్న్ చేయడంలో వేగవంతంగా పని చేస్తుంది. ఇక నిమ్మకాయ శరీరం నుంచి టాక్సిన్స్ ను తొలగించి జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. నిర్విషీకరణకు సహాయపడుతుంది . ఈ టీ కడుపు మంటను తగ్గిస్తుంది. తద్వారా ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగుతుంది. ఒక కప్పు నీటిలో 2-3 అల్లం ముక్కలను మరిగించి, అందులో సగం నిమ్మకాయను పిండుకుని తాగాలి. భోజనం తర్వాత దీన్ని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
దాల్చిన చెక్క టీ: దాల్చిన చెక్క చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇది తీపి కోరికలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. శరీరంలో కొవ్వు నిల్వను నిరోధిస్తుంది. ఈ టీ బొడ్డు కొవ్వును తగ్గిస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో ½ టీస్పూన్ దాల్చిన చెక్క పొడి లేదా దాల్చిన చెక్కను వేసి 5 నిమిషాలు మరిగించాలి. రాత్రి పడుకునే ముందు దీన్ని తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
పుదీనా టీ: పుదీనా టీ ఆకలిని నియంత్రిస్తుంది. కాబట్టి మీరు అతిగా తీసుకోవద్దు. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆహార జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఉండే మెంథాల్ శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే జీవక్రియను పెంచుతుంది. ఒక కప్పు వేడి నీటిలో తాజా పుదీనా ఆకులను వేసి 5-7 నిమిషాలు మరిగించాలి. తినడానికి ముందు దీన్ని తాగడం మంచిది.
పసుపు టీ: పసుపులో ఉండే కుర్కుమిన్ శరీరంలో మంటను తగ్గిస్తుంది. కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది. శరీరం నుంచి టాక్సిన్స్ ను తొలగిస్తుంది. పసుపు టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మిమ్మల్ని ఫిట్‌గా, చురుగ్గా ఉంచుతుంది. ఒక కప్పు వేడి నీటిలో ½ టీస్పూన్ పసుపు పొడి, కొద్దిగా నల్ల మిరియాల పొడి కలపి తయారు చేసుకోవాలి. దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
ఖాళీ కడుపుతో టీ తాగవద్దు: కొన్ని రకాల టీలలో కెఫిన్ ఉంటుంది. ఇది ఖాళీ కడుపుతో తీసుకుంటే ఆమ్లతను పెంచుతుంది. ఎక్కువ చక్కెర లేదా తేనె యాడ్ చేస్తే బరువు తగ్గడం కష్టం అవుతుంది. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో వీటిని తీసుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు దీన్ని మీ డైట్ లో భాగంగా చేసుకోండి. కొన్ని రకాల టీలలో ఉండే కెఫిన్ నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇది బరువు తగ్గించే ప్రక్రియను నెమ్మదిస్తుంది.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Success: జీవితంలో విజయం పొందాలంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే