Periods : పీరియడ్స్ సమయంలో కాళ్లు నొస్తున్నాయా? ఎందుకు? ఏం చేయాలి?

Periods :
పీరియడ్స్ అనేవి మహిళలకు మామూలుగా ప్రతి నెల వస్తుంటాయి. ఈ రుతుచక్రం స్త్రీల శరీరంలో జరిగే ఎన్నో మార్పులను సూచిస్తుంది. మానసిక స్థితి నుంచి గర్భధారణ స్థితి వరకు జరిగే చాలా మార్పులను సూచిస్తుంది ఈ రుతుచక్రం. అయితే ఈ సమయంలో చాలా పెయిన్ అనుభవిస్తుంటారు మహిళలు. చాలా తక్కువ మందికి మాత్రమే ఆ పెయిన్ ఉండదు. మిగిలిన చాలా మంది నొప్పితో బాధ పడుతుంటారు. అయితే గర్భాశయం లైనింగ్ విచ్ఛిన్నం అవడం ప్రారంభించినప్పుడు, అండం విరిగిపోవడం వల్ల రక్తస్రావం ప్రారంభం అవుతుంది. ఇక ఈ సమయంలో స్త్రీ గర్భవతి కాదు అని చెప్పే పెద్ద సూచిక ఇది.
ఋతుచక్రం 21 నుంచి 35 రోజుల మధ్య ఉంటుంది. దానితో పాటు వచ్చే కొన్ని అసాధారణ లక్షణాలు ఆందోళనకరంగా, బాధ కలిగించేవిగా ఉంటాయి. వాటిలో ఒకటి కాళ్ళ తిమ్మిర్లు మరింత ఎక్కువగా బాధ పెడుతుంటాయి. అందరికీ ఈ నొప్పి ఉండకపోవచ్చు. కానీ చాలా మందికి మాత్రం ఈ నొప్పి వస్తుంది. మరి దీనికి కారణాలు ఏంటి? ఎలా నివారించుకోవాలి వంటి విషయాలు తెలుసుకోవడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది.
ఋతు చక్రం ప్రారంభానికి రెండు వారాల ముందు వరకు ఋతు అసౌకర్యం ప్రారంభమై, ఆ ఋతు కాలం అంతా కొనసాగుతుంది. దీనిని లూటియల్ దశ అంటారు. శరీరం ప్రోస్టాగ్లాండిన్‌లను తయారు చేస్తుంది. ఈ పదార్థాలు గర్భాశయం సంకోచించడానికి, గర్భాశయ పొరను ఖాళీ చేయడానికి సహాయపడతాయి. ఇక పీరియడ్స్ సమయంలో హార్మోన్ల మార్పులు రక్త ప్రసరణను దెబ్బతీస్తాయి. దీని కారణంగా కాళ్ళలో బరువు లేదా నొప్పి అనిపిస్తుంది. హార్మోన్ల మార్పులు కూడా నీరు నిలుపుదల, కండరాల వాపు, అంతర్గత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా కాళ్ళు, తొడలలో ఈ అసౌకర్యం, నొప్పి మరింత తీవ్రంగా ఉంటుంది.
ఋతుచక్రం కారణంగా కాళ్ళలో భారం, అసౌకర్య భావనను పెంచుతాయి. తగినంత నీరు, ఆహారం, సరైన జీవన విధానం లేకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంది. అయితే, మీ కాళ్ళలో నొప్పి భరించలేనంతగా మారి, మీ ఋతుస్రావం తర్వాత కూడా కొనసాగితే, అది అంతర్లీన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. సో జాగ్రత్త తప్పనిసరి.
మీరు కూడా అలాంటి సమస్యలను ఎదుర్కొంటుంటే, మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు, చేపలు, ఒమేగా-3 అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. దీనితో పాటు, వీలైనంత వరకు పప్పుధాన్యాలు, ప్రోటీన్, గుడ్లు, బియ్యం, పాస్తా వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం అవసరం అని గుర్తు పెట్టుకోండి.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Red Rice : వైట్ కంటే ఈ రైస్ ఎందుకు ఆరోగ్యానికి మంచివి?
-
Tea and Coffee : టీ , కాఫీలు ఎక్కువ తాగితే పిల్లలు పుట్టరా?
-
Astronaut: మహిళలకు అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే?
-
Periods Problem : 16 సంవత్సరాలైన రుతుస్రావం రాలేదా? లేదా వచ్చి ఆగిపోయిందా?
-
Gastric Problem : గ్యాస్ సమస్యతో బాధ పడుతున్నారా? ఇంతకీ ఎందుకు ఈ సమస్య వస్తుంది. నివారణ మార్గాలు ఏంటి?
-
Mouth Cancer : నోటి క్యాన్సర్ ఉంటే మీరే సులభంగా గుర్తించవచ్చు? ఎలాగంటే?