Hair Health Tips: పదే పదే గుండు చేయిస్తే వెంట్రుకలు మందంగా వస్తాయా?

Hair Health Tips: గుండు తీయడం వల్ల జుట్టు ఒత్తుగా అవుతుంది అని చాలా మంది నమ్ముతారు. అందుకే పిల్లలకు మాటి మాటికి గుండు తీయిస్తారు. అయితే మీరు కూడా మీ బిడ్డ జుట్టును షేవింగ్ చేయిస్తున్నారా? దీని వల్ల జుట్టు నిజంగానే ఒత్తుగా పెరుగుతుందా? నవజాత శిశువు మృదువైన జుట్టును కత్తిరించడం వల్ల ఒత్తైన జుట్టు వస్తుందని నమ్మేవారు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇందులో ఏదైనా నిజం ఉందా? సాంస్కృతిక సంప్రదాయాలు తరచుగా ఈ ఆచారాన్ని ప్రోత్సహిస్తాయి. అయితే సైన్స్ అలాంటి వాటిని నమ్మదు. దీనికి సంబంధించిన వేరే కథ చెబుతుంది. జుట్టు పెరుగుదల కేవలం తల చర్మం ఉపరితలం మీద కాకుండా ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. షేవింగ్ దాని సహజ ఆకృతిని లేదా మందాన్ని మార్చదు అంటున్నారు నిపుణులు. దీనికి సంబంధించిన పురాణాల గురించి తెలుసుకుందాం. పిల్లల జుట్టు మందంగా ఉంటుందా లేదా అనేది జన్యుపరమైన అంశాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
పిల్లలు పుట్టినప్పుడు, వారి జుట్టు తరచుగా సన్నగా, మృదువుగా ఉంటుంది. దీన్ని వెల్లస్ హెయిర్ అంటారు. కాలక్రమేణా, హార్మోన్ల మార్పులు, జన్యుపరమైన కారణాల వల్ల, అవి సహజంగా మందంగా, ముదురు రంగులోకి మారుతాయి. షేవింగ్ ఈ ప్రక్రియను వేగవంతం చేయదని అంటున్నారు డాక్టర్లు.
దృశ్య భ్రమ: గుండు చేయిస్తే మీకు జుట్టు మందంగా కనిపిస్తుంది కావచ్చు. జుట్టు తిరిగి పెరుగుతుంది. అందుకే సన్నగా కాకుండా దట్టంగా కనిపిస్తుంది.
సాంస్కృతిక పద్ధతులు: అనేక ఆచారాల వల్ల పిల్లల తల గుండు కొడతారు. దానిని సైన్స్‌తో కాకుండా సంప్రదాయంతో ముడిపెడతారు. 6-12 నెలల వయస్సులో శిశువుల జుట్టు సహజంగానే మందంగా మారుతుంది. చాలా మంది తల్లిదండ్రులు జుట్టు కత్తిరించుకునే వయసు అదే. కాబట్టి వారి జుట్టు కాలక్రమేణా పొడవుగా, మందంగా మారడం ప్రారంభమవుతుంది.
అపోహను కొట్టిపారేసే అధ్యయనం: జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ డెర్మటాలజీలో ప్రచురించిన 2017 అధ్యయనంలో, 100 మంది శిశువులను రెండు గ్రూపులుగా విభజించారు. గుండు చేయించుకున్న వారిని, గుండు చేయించుకోని వారిగా విభజించారు. 12 నెలల తర్వాత వీరిని గమనిస్తే తల్లిదండ్రులకు మందపాటి, ఒత్తు జుట్టు ఉన్న పిల్లల జుట్టు మందంగా, ఒత్తుగా వచ్చిందని గుండు కొట్టించడం వల్ల రాలేదు అని తేలిందట. సహజంగా మాత్రమే జుట్టు వస్తుందని గుండు కొట్టించుకోవడం వల్ల రాదు అని ఈ అధ్యయనం తేల్చింది.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Hair: జుట్టు నివారణ చర్యలు కాదు.. జుట్టు ఎందుకు రాలుతుందో తెలుసుకోవడం ముఖ్యం
-
Rosemary Oil: తలకు రోజ్‌మెరీ ఆయిల్ అప్లై చేయవచ్చా? చేస్తే జుట్టు పెరుగుతుందా?
-
Hair Health Tips: నీరు మారితే జుట్టు ఊడిపోతుందా? మరి చుట్టాల ఇంటికి, స్విమ్మింగ్ ఫూల్ కు వెళ్లినప్పుడు పరిస్థితి ఏంటి?
-
Hair: చికెన్‌కి, జుట్టుకి లింక్ ఏంటి.. దీనివల్ల జుట్టు పెరుగుతుందా.. ఇందులో నిజమెంత?
-
Hair Health: మీ జుట్టు బూడిద రంగులోకి మారిందా? వీటిని తింటే అసలు రంగే మారదు.
-
Hair Health: ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ జుట్టు రాలడాన్ని ఆపడం కష్టమే..